వింత పెళ్ళి వధువుకు తాళి కట్టిన వరుడి సోదరి
వధువు మెడలో వరుడి సోదరి తాళి కట్టింది. వరుడికి సెలవు ఇవ్వని కారణంగా ఆయనకు బదులుగా ఆయన సోదరి తాళికట్టిన ఘటన కేురళలో చోటుచేసుకొంది. హరీస్ ,శ్యామలకు వివాహం చేయాలని నిర్ణయించారు. సౌదీలో పనిచేసే హరీస్ కు ఆ
కేరళ :ఆమెకు ఆమెనే తాళి కట్టింది. నిజమే మీరు చదివింది వాస్తవమే. వరుడికి బదులుగా ఆయన సోదరి వధువు మెడలో తాళి కట్టింది. ఇదేమీ వింత పెళ్ళి అనుకొంటున్నారా, సెలవు దొరకని కారణంగా వరుడు తరపున అతని సోదరి తాళి కట్టాల్సిన పరిస్థితులు కేరళలో చోటుచేసుకొన్నాయి.
కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన హరిస్ సౌదీ అరేబీయాలోని ఓ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు వివాహన్ని నిశ్చయించారు కుటుంబసభ్యులు. కేరళకు చెందిన శ్యామలతో ఆయన వివాహం నిశ్చయమైంది. ఈ వివాహనికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాయి.
శ్యామలతో వివాహం కోసం రెండు రోజుల క్రితం వివాహం నిశ్చయించారు. అయితే నిర్ణీత సమయానికి కేరళకు చేరుకోవాల్సిన హారీస్ రాలేకపోయాడు. ఆయన పనిచేస్తోన్న కంపెనీ హరీస్ కు సెలవు ఇవ్వలేదు. దీంతో వివాహం జరపాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు రెండు కుటుంబసభ్యులు.

వధువు మెడలో వరుడి సోదరి తాళి కట్టడం వింతగా అన్పిస్తోంది. హరీస్ కు ఇంతకు మించిన మార్గం మరోటి లేకపోయింది. అదే ముహుర్తానికి వివాహం జరగాలంటే ఇదే మంచి పద్దతిగా భావించి ఇరు కుటుంబసభ్యులు భావించారు.ఆన్ లైన్ ద్వారా శ్యామల , హరీస్ ఒక్కటయ్యారు.












Click it and Unblock the Notifications