ట్రంప్‌కు కొమ్ములు, హిట్లర్ పోలిక!: ఇది ‘టైమ్’ అవమానమే?
టైమ్ మేగజైన ప్రచురించిన ట్రంప్ ఫొటోపై తాజాగా ట్విట్టర్‌లో కొత్త చర్చ నడుస్తోంది. కవర్ ఫొటోపై ట్రంప్‌ను అవమానించే రీతిలో టైమ్ సంపాదకులు తీర్చిదిద్దారని వారు ఆరోపిస్తున్నారు.
న్యూయార్క్: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రముఖ వార్తా సంస్థ టైమ్ మేగజైన్ 'ఈ ఏడాది మేటి వ్యక్తి(పర్సన్ ఆఫ్ ది ఇయర్)'గా ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించినందుకు గానూ ఆయన్ను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.
కాగా, టైమ్ మేగజైన ప్రచురించిన ట్రంప్ ఫొటోపై తాజాగా ట్విట్టర్‌లో కొత్త చర్చ నడుస్తోంది. కవర్ ఫొటోపై ట్రంప్‌ను అవమానించే రీతిలో టైమ్ సంపాదకులు తీర్చిదిద్దారని వారు ఆరోపిస్తున్నారు. టైమ్ పేరులోని 'ఎం' అక్షరం మధ్యలో ట్రంప్ తల రావడంతో ఎం అక్షరం ఆయనకు కొమ్ములు వచ్చినట్లుగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో వారు మండిపడుతున్నారు.
అంతేగాక, విభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు' గా అభివర్ణిస్తూ కవర్ ఫొటో టైమ్ ప్రచురించడంతో వారి వాదనలకు మరింత బలం చేకూరింది. మరోవ్యక్తి ఏకంగా నియంత హిట్లర్‌తో పోలుస్తూ ట్రంప్ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగానే టైమ్ ప్రచురించిందంటూ ట్వీట్ చేయడం గమనార్హం.
ఉద్దేశపూర్వకంగా 'టైమ్' మేగజైన్ ఈ విధంగా చేసిందో లేదో తెలియదు గానీ ట్విట్టర్‌లో మాత్రం మ్యాగజైన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు' అని టైమ్ ప్రచురించడంపై ట్రంప్ కూడా స్పందించారు. తాను దేశం విడిపోయే విధంగా ఏమీ చేయలేదని చెప్పడం సమాధానమిచ్చారు. కాగా, ఈ పోటీలో హిల్లరీకి రెండో స్థానం రాగా.. రీడర్స్ పోల్‌లో భారత ప్రధాని మోడీకి ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.
Interesting how @Time put #Hitler and #Trump in similar chairs and positions, back-to-back. Intentional I'm sure. pic.twitter.com/ytVLjg5wyH
— Temote Bodo (@TemoteBodo) 7 December 2016
did they … wait … are those … devil horns? pic.twitter.com/LgittWyTEa
— Mike, but furious (@mikerugnetta) 7 December 2016
Given all of the sets of eyes that vet a prospective Time cover, the odds that those Devil Horns are accidental: 0%. pic.twitter.com/jqGGs4wJRZ
— David Hobby (@strobist) 8 December 2016
-
Trump: "అంతా బూడిద చేశాం.. ఇక యుద్ధం ముగిస్తాం" -
యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా పుతిన్! ట్రంప్‌తో సీక్రెట్ ప్లాన్? -
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications