ఐపీఎల్ బెట్టింగ్‌లో భార్యను పెట్టాడు, అసభ్యకర ప్రవర్తన
కాన్పూర్: ఓ వ్యక్తి ఐపీఎల్ బెట్టింగులో భార్యను పణంగా పెట్టి ఓడిపోయిన షాకింగ్ సంఘటన కాన్పూర్‌లో చోటు చేసుకుంది. కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఐపీఎల్ కోసం బెట్టింగులు కడుతుంటాడు. ఐపీఎల్ 9 నేపథ్యంలో బెట్టింగులు కడుతున్నాడు.
బెట్టింగులో సర్వం పోగొట్టుకున్నాడు. అతనికి ఇక మిగిలింది భార్యనే! దీంతో ఆమె వైపు చూశాడు. బెట్టింగులో భార్యను కూడా పెట్టాడు. బెట్టింగులో భార్యను పెట్టిన అతను ఓడిపోయాడు.

అతను బెట్టింగులో ఓడిపోవడంతో బెట్టింగ్ రాయుళ్లు ఆమెను తీసుకు వెళ్లడానికి ఇంటికి వచ్చారు. ఆమెకు పదేపదే ఫోన్లు చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. వారి వేధింపులు ఆ భార్య తట్టుకోలేకపోయింది. పలువురి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో సంఘటన వెలుగు చూసింది. పెళ్లైన మొదటి రోజు నుంచే భర్త నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని, నగలు, ఆస్తులు అన్నింటిని షేర్ మార్కెట్లో కోల్పోయాడని ఆమె తెలిపింది. తన తల్లిదండ్రుల నుంచి రూ.7 లక్షలు తీసుకు రావాలని తనను హింసించాడని, ఇప్పుడు బెట్టింగులో తనను పెట్టాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications