ఛలో యార్!: ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యకరంగా, అరెస్ట్
ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఎయిర్ హోస్టెస్‌ను వేధించినందుకు, ఆమెతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఒత్తిడి చేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు, సదరు వ్యక్తి టాయిలెట్లో స్మోకింగ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించాడు.
మహమ్మద్ అబూబకర్ (29) జెట్ ఎయిర్ వేస్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతనికి ఎయిర్ హోస్టెస్‌తో సెల్ఫీ దిగాలనిపించింది. అడిగితే, ఆమె నిరాకరించింది. దీంతో ఆమె వెనకాలే వెళ్లి వేధించాడు. దీంతో ఇబ్బందిపడిన ఆమె కేకలు వేసింది. వెంటనే క్రూ సిబ్బంది వచ్చారు.
వారిని చూసిన అబూబకర్ వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లి సిగరెట్ కాల్చి బయటకు వచ్చాడు. ఈ ఘటనపై సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

సెక్యూరిటీ చెక్‌ను తప్పించుకుని అబూబకర్ విమానంలోకి సిగరెట్, లైటర్ ఎలా తీసుకురాగలిగాడన్న విషయంపై దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుజరాత్‌వాసి అని తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు.
ఆ విమానం దమామ్ - ముంబై విమానం. విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత ఎయిర్ హోస్టెస్ మాట్లాడుతూ... తాను నడుస్తుండగా నిందితుడు అబూబకర్ వచ్చి తన చేయి పట్టుకున్నాడని, చలో యార్, ఓ సెల్ఫీ తీసుకుందామని అన్నాడని చెప్పారు. ప్రయాణంలో అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు.
తన వెనుక ఎవరో ఫాలో అవుతున్నట్లుగా గుర్తించానని, అప్పటి నుంచి తనకు అతని నుంచి వేదన ప్రారంభమైందని చెప్పారు. తాను నడుస్తుండగా తన వెనుకాలే వచ్చాడని చెప్పింది. అంతేకాదు, తన భుజంపై బలవంతంగా చేయి వేసి, ఓ సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications