దొంగగా మారిన ఎస్సై: రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు

హైదరాబాద్: దొంగలను పట్టుకోవాల్సిన పోలీసే దొంగగా మారాడు. ఎవరూ లేని సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి చోరీకి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన హైదరాబాదులోని మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బడంగ్‌పేట నగర పంచాయతీలోని గుర్రంగూడకు చెందిన జక్కిడి మహేందర్‌రెడ్డి సీసీఎ్‌సలో(2009 బ్యాచ్‌) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.

వికారుద్దీన్‌పై వేసిన దర్యాప్తు బృందంలో అతడు సభ్యుడు కూడా. గురువారం అర్థరాత్రి అల్మాస్‌గూడలోని శ్రీశ్రీ హోమ్స్‌లో శివప్రసాద్‌ ఇంట్లో చోరీకి ప్రయత్నించాడు. శివప్రసాద్‌ దసరాకు కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలం కరీంనగర్‌కు వెళ్లాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి.

కిటికీ గ్రిల్‌ తొలగించి ఉండడంతో దొంగతనం చేయడానికి ఎవరో వచ్చారని గుర్తించాడు. ఆ సమయంలో బయట ఉన్న బాత్‌రూమ్‌లో నుంచి ఓ వ్యక్తి బయటకు రావడం శివప్రసాద్‌ గమనించాడు. అతడిని పట్టుకుని నిలదీశాడు. తాను సీసీఎస్‌ ఎస్సైనని, నయీమ్‌ కేసు దర్యాప్తు బృందంలో సభ్యుడిగా ఉన్నానని, ఈ ప్రాంతంలో కొన్ని వివరాలు సేకరించడానికి వచ్చానని చెప్పాడు.

SI breaks into house, held for attempt to theft

దీంతో శివప్రసాద్‌ డయల్‌ 100కు సమాచారమిచ్చాడు. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి సిబ్బందితో అక్కడకు చేరుకుని మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నయీమ్‌ కేసులో కాకుండా వికారుద్దీన్‌ కేసుకు సంబంధించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే శివప్రసాద్‌ ఇంటి కిటికి గ్రిల్‌ తొలగించి ఉండడంతో మహేందర్‌రెడ్డి దొంగతనానికే వచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

చోరీయత్నం కేసు నమోదు చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి తెలిపారు. సీసీఎ్‌సలో మహేందర్‌ రెడ్డి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు.

సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న మహేందర్‌రెడ్డి

మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తాను సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్నానని వెల్లడించాడు. అతని వద్ద గుర్తింపు కార్డు కూడా లభించింది. విచారణలో మహేందర్‌రెడ్డి పలు కథనాలు వినిపించాడు.

తాను నయీం కేసు విచారణ బృందంలో ఉంటూ ఈ ఇంటిపై నిఘా పెట్టానని ఒకసారి, తన మానసిక పరిస్థితి బాగోలేదని ఇక్కడకు ఎందుకు వచ్చానో తనకే తెలియదని మరోసారి, కుటుంబ సమస్యలతో ఇలా మారానని ఇంకోసారి పోలీసులకు చెప్పుకొచ్చాడు.

2009వ బ్యాచ్‌కు చెందిన మహేందర్‌రెడ్డి గుర్రంగూడలో నివాసి. గతంలో పంజాగుట్ట, బహుదూర్‌పురా పోలీస్‌స్టేషన్లలో పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)కు అటాచ్డ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పంజాగుట్టలో పనిచేసే సమయంలో ఇతనిపై చీటింగ్ కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+