గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లికి గండమా?

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లికి గండం తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి విషయంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచురుడు, మాజీ మంత్రి శ్రీరాములు చెబుతున్న మాటలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

గాలి జనార్ధనరెడ్డిది మధ్యతరగతి కుటుంబమని, అందుకే మిడిల్ క్లాస్ స్టైల్లో పెళ్లి చేస్తున్నారని శ్రీరాములు అన్నారు. గాలి జనార్ధనరెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా తెరమరుగైన గాలి కూతురి వెడ్డింగ్ కార్డుతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు.

Trouble for Gali Janardhan Reddy's daughter?

ఖరీదైన వెడ్డింగ్ కార్డుతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే జైలు నుంచి బయటికొచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి ఇంత డబ్బెక్కడిది? ఎంత డబ్బున్నప్పటికీ బెయిల్‌పై బయటికొచ్చిన వ్యక్తి ఇంత బహిరంగంగా ఖర్చు చేయడానికి కారణం ఏమిటి, గాలి ఖర్చుపెడుతున్న డబ్బు అక్రమ సొమ్మా? సక్రమ సొమ్మా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది.

పెళ్లికి దాదాపు 550కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వార్తలు రావడంతో గాలి కూతురి పెళ్లి వ్యవహారంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఆదాయపుపన్ను శాఖ అధికారులు గాలి అక్రమ ఆస్తులపై మరోసారి దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పెళ్లిపై పెడుతున్న ఖర్చు అప్పనంగా వచ్చిన సొమ్మని తేలితే గాలి మరోసారి కటకటాల పాలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూడేళ్ల పాటు జైలు జీవితం గడిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+