ఏం చేసింది: పిజ్జా ఆర్డర్ చేస్తే..వేల డాలర్లొచ్చాయి!

న్యూయార్క్: ఓ మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. దీంతో కొద్ది సమయంలోనే పిజ్జా బాయ్ వచ్చి ఆమెకు పిజ్జా బాక్స్‌ను అందజేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాక్స్ తెరిచి చూసిన ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే ఆ బాక్స్ లో వేడి వేడి పిజ్జా బదులు.. వేల డాలర్ల కరెన్సీ నోట్లు కనిపించాయి. ఈ సందర్భంలో చాలా మంది ఆ డబ్బును తమ వద్దే ఉంచేసుకోవాలనే అనుకుంటారు. కానీ, ఆ మహిళ మాత్రం డబ్బు తిరిగిచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన 'సెలీనా' ఓ రోజు చికెన్‌ పిజ్జా తినాలనుకుంది. వెంటనే 'డొమినో పిజ్జా'కు ఫోను చేసి ఆర్డర్‌ చెప్పింది. కొంత సమయానికి పిజ్జా బాయ్‌ డెలివరీ చేసి వెళ్లిపోయాడు.

Woman Who Returned $5,000 She Found in Domino’s Box Now Gets Free Pizza

వేడివేడిగా పిజ్జా తిందామని సెలీనా బాక్స్‌ తెరిచింది. పిజ్జా స్థానంలో నోట్ల కట్టలు ఉండటం చూసి షాకైంది. ఆ మొత్తం విలువ 5వేల డాలర్లు, అంటే సుమారు రూ.3లక్షల పైమాటే. అంత మొత్తంలో డబ్బును చూస్తే ఎవరికైనా.. వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీ దేవిని ఇంట్లోనే ఉంచుకోవాలనిపిస్తోంది.

కానీ, సెలీనా అలా చేయలేదు. పరుల సొమ్ము పాము వంటిదని భావించింది. వెంటనే.. ఆర్డరు చేసిన పిజ్జా సెంటర్‌కు ఫోను చేసి విషయమంతా చెప్పింది. ఆ డబ్బు వారిదే అని తేలడంతో సిబ్బందికి ఆ మొత్తాన్ని ఇచ్చేసింది.

సెలీనా మంచితనానికి ముగ్దులైన డొమినోస్‌ సిబ్బంది.. ఆమె నిజాయితీకి బహుమతిగా ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. అందుకోసం సెలీనాకు ఏడాదిపాటు డొమినో పిజ్జా ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నారు.

అసలు పిజ్జా బాక్స్‌లోకి 5,000 డాలర్లు ఎలా వచ్చాయంటే.. డొమినో పిజ్జా యజమాని బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకొని పిజ్జా కేంద్రానికి వచ్చాడు. సరిగ్గా సెలీనాకు పిజ్జా పార్సెల్‌ చేస్తున్నప్పుడే పొరపాటున పిజ్జాకు బదులు డబ్బులు ఆ బాక్స్‌లో పెట్టేశాడు. ఈ విషయం గుర్తించకుండా అలాగే డెలివరీ కూడా చేసేశారు. దీంతో సెలీనా ఇల్లు చేరిన డబ్బు మళ్లీ అలాగే యజమాని వద్దకు చేరింది. కాగా, సెలీనా చేసిన పనికి అందరి నుంచి ప్రశంసలు రావడంతోపాటు, డొమినో నుంచి మాత్రం ఆమెకు ఏడాదిపాటు ఉచితంగా పిజ్జా లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+