అంతలోనే.. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంతర్యం: అసలేం జరిగింది?
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం అందరిలోను చర్చకు దారి తీసింది. ఆయన చేరిక దాదాపు ఖాయమైంది.
Recommended Video

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం అందరిలోను చర్చకు దారి తీసింది. ఆయన చేరిక దాదాపు ఖాయమైంది.

పరిణామాలు కాంగ్రెస్‌లో చేరుతారనేందుకు ఊతం
మంగళవారం జరిగిన పరిణామాలు ఆయన టిడిపి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారని, ఆయన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఈ వార్తలను రేవంత్ రెడ్డి వెంటనే కొట్టిపారేశారు.

అంతలోనే మాట మార్చారు
తాను రాహుల్ గాంధీని కలవడం లేదని, కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మాత్రం మాట మార్చారు. పార్టీ మారే అంశంపై తర్వాత మాట్లాడుతానని ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత హైదరాబాదులో మాట్లాడలేదని తెలుస్తోంది.

ఉత్తమ్ వచ్చిన అరగంటకు రేవంత్ రెడ్డి రాక
రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు చక్రం తిప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పరిణామాలు చూస్తుంటే ఇవి వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు. మంగళవారం రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన అరగంట తర్వాత రేవంత్ రెడ్డి వచ్చారు.

ఇరువురు కలిసి రాహుల్ గాంధీని కలిశారు
ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఒకరి తర్వాత ఒకరు హైదరాబాదులో అడుగు పెట్టారు. దీంతో ఇరువురు కలిసే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసినట్లుగా భావిస్తున్నారు. రాహుల్ వద్దకు రేవంత్‌ను ఉత్తమ్ వెంట పట్టుకొని వెళ్లి ఉంటారని అంటున్నారు.

కోమటిరెడ్డి ఏం చెప్పారంటే
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అని, సిద్ధాంతాలతో ఏకీభవిస్తే పార్టీలోకి ఎవరైనా రావొచ్చునని చెప్పారు.

ఢిల్లీ పర్యటన ఆంతర్యం
మొత్తంగా చూస్తుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకేనని అర్థమవుతోంది. ఆయన చేరిక దాదాపు ఖాయమైనప్పటికీ ఇంకా కొన్ని అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications