విమానంలో హస్తప్రయోగం, మహిళ ఫిర్యాదు: ఎయిర్ హోస్టెస్‌కు చెప్పడంతో..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో హస్తప్రయోగం చేసిన 55 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఓ మహిళా ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఆ మహిళ సదరు వ్యక్తి తర్వాత సీటులో కూర్చుంది. ఆ వ్యక్తి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉంటున్నాడు.

సమాచారం మేరకు.. హైదరాబాద్ - ఢిల్లీ విమానంలో సదరు వ్యక్తి తన ప్యాంట్ జిప్ తీసి హస్త ప్రయోగం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Delhi man arrested for masturbating mid-air on IndiGo flight from Hyderabad

అప్పుడు తాను ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకు వెళ్లానని, ఆమె తన సీటును వెంటనే మార్చిందని ఫిర్యాదులో పేర్కొంది.

విమానం ఢిల్లీలో దిగగానే ఇండిగో సెక్యూరిటీ అతనిని అదుపులోకి తీసుకుంది. అనంతరం అతనిని పోలీసులకు అఫ్పగించారు. అతనిపై సెక్షన్ 509, సెక్షన్ 354ఏల కింద కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Delhi man was arrested by the police after a woman accused him of masturbating mid-air on a Hyderabad-New Delhi flight.
Please Wait while comments are loading...