‘నువ్వు స్వీట్ హార్ట్.. నేను ధనవంతుడ్ని’: హాలీవుడ్ నటికి ట్రంప్ డేట్ ప్రపోజల్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో సాగించిన ప్రేమ కలాపాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే తమకు పెళ్లి ప్రతిపాదనలు కూడా ట్రంప్ పంపారని పలువురు హాలీవుడ్ తారలు స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. వారిలో సల్మా హయక్, కేండిస్ బెర్జన్, ఎమ్మా థాంప్సన్ వంటి వారు కూడా ఉన్నారు.

అయితే, ట్రంప్ ప్రతిపాదనను తాము తిరస్కరించినట్లు ఆ తారలు చెప్పడం గమనార్హం. తాజాగా, ప్రముఖ హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ కూడా ట్రంప్ గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

'I'm America's richest man!': Brooke Shields reveals awful pick-up line Donald Trump used when he cold-called the actress to ask her on a date

డొనాల్డ్ ట్రంప్ తనకు కూడా డేట్ ప్రపోజ్ చేశారని బ్రూక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, తాను ఆయన ప్రతిపాదనను తిరస్కరించానని తెలిపారు. ట్రంప్ తన రెండో భార్య మార్లా మేపుల్స్ నుంచి విడాకులు తీసుకున్న వెంటనే తనకు ఫోన్ చేశాడని బ్రూక్ చెప్పారు. అప్పుడు తాను ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు.

'నువ్వు అమెరికన్ల స్వీట్ హార్ట్.. నేను అమెరికాలో అత్యంత ధనవంతుడిని. మనిద్దరం కలిస్తే అందరికీ సంతోషం' అంటూ డేట్‌కి రావాలని ప్రపోజ్ చేశాడని బ్రూక్ తెలిపారు. అయితే, తనకు అప్పటికే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి.. ఆ ప్రతిపాదనను తిరస్కరించానని వివరించారు బ్రూక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+