సంచలనం: బాత్ రూమ్ లో సెలబ్రిటీల సెల్పీ, కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: మెట్ గాలా షో లో సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ తీసిన ఓ సెల్పీ వివాదాస్పదంగా మారింది. బాత్ రూమ్ లో సెలబ్రిటీలు ఉంటే కైలీ తన కెమెరాతో సెల్పీలు తీసింది. ఈ షో నిర్వాహకులు సెల్పీలో ఉన్న సెలబ్రిటీలపై మండిపడుతున్నారు.

పలు దేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు మెట్ గాలా ఫ్యాషన్ షోలో విభిన్న ఆహార్యంతో అదరగొట్టారు. అయితే ఓ సెల్పీ వైరల్ గా మారింది. అమెరికాలోని న్యూజెర్సీలో 68వ, వార్షిక మెట్ గాలా ఫ్యాషన్ షో ను అట్టహాసంగా నిర్వహించారు.

ఆ షోలో సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ తీసిన ఓ సెల్పీ వివాదంగా మారింది. మెట్ గాలా వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఓ బాత్రూమ్ కు వెళ్ళగా కైలీ తన కెమెరాకు పని చెబుతూ సెల్పీ తీసింది.

Kylie Jenner Takes Bathroom Selfie at Met Gala 2017

షో నిర్వాహకులు సెల్పీలో ఉన్న సెలబ్రిటీలపై మండిపడుతున్నారు. మెట్ గాలా రూల్స్ ప్రకారం సాధారణంగానే సెల్పీలు దిగడం నిబంధనలకు విరుద్దం. కానీ, కెండల్ జెన్నర్, కిమ్ కర్డాపియన్, లిలీ ఆర్ డ్రిడ్జ్, రాకీ, పబ్ డాడీ, బ్రీ లార్సన్, పారిస్ జాక్సన్ తదితరులు బాత్రూమ్ లో గుమికూడగా కైలీ జెన్నర్ సెల్పీ తీసింది.

ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలో 20 లక్షల మంది లైక్ చేయగా, 5.15 లక్షల మంది ఈ ఫోటోపై కామెంట్ చేయడం విశేషం. ఈ ఫ్యాషన్ ఈవెంట్లో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రాలు పాల్గొని సందడి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After the celebs walked the red carpet and had 10,000 photos taken, they retreated to celebrate and hang out together ... in the bathroom. Kylie, ever the social media pro, snapped a pic of everyone to mark the occasion.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి