ఎంపీ గీత 'కులం'పై వెనక్కి తగ్గిన సుధారాణి: బాబు వల్లే రాజీ కుదిరిందా?..

అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సుధారాణి వెనక్కి తగ్గినా.. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు అక్కడి గిరిజనులు. పార్టీ అధినేత చెప్పగానే పిటిషన్ ఉపసంహరించుకుంటారా? అని ప్రశ్నించారు.

సాలూరు: రాజకీయాల్లో కేసుల భయం చాలామంది నేతలను ఫిరాయింపులకు ఉసిగొల్పడం ఏపీ పాలిటిక్స్‌ను గమనిస్తే సులువుగా అర్థమవుతుంది. అధికార పార్టీలో చేరే ప్రత్యర్థి నాయకులు కేసులు నుంచి విముక్తి అవుతుండటం ఇందుకు నిదర్శనం. తాజాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత విషయంలోను ఇదే జరిగింది.

ఎస్టీ రిజర్వ్ స్థానం నుంచి పోటీ చేసిన కొత్తపల్లి గీత.. అసలు గిరిజన మహిళే కాదంటూ గతంలో కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే గుమ్మడి సుధారాణి తాజాగా తన పిటిషన్ ఉపసంహరించుకుంది. గీత కూడా ప్రస్తుతం టీడీపీలోనే ఉండటంతో సొంతగూటి నేతల మధ్యే కోర్టు తగాదాలు ఎందుకని భావించారో.. ఏమో గానీ మొత్తానికి సుధారాణి వెనక్కి తగ్గారు. అయితే సీఎం చంద్రబాబు జోక్యం మేరకే ఆమె పిటిషన్ ఉపసంహరించుకున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

MLC Sudharani withdraws petition on mp kothapalli geetha

కాగా, ఎంపీగా గీత ఎన్నిక చెల్లదని, ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గతంలో ఎమ్మెల్సీ సుధారాణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను కొట్టివేయాలంటూ ఎంపీ గీత కౌంటర్ దాఖలు చేసినా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. దీంతో గీత సామాజిక వర్గంపై వివాదం రగులుతూనే ఉంది. అయితే ఎంపీగా గెలిచిన కొద్దిరోజులకే ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో.. కేసు నుంచి విముక్తి లభిస్తుందని గీత ముందే ఊహించి ఉంటారు. నిజానికి ఆ హామి మేరకే గీత టీడీపీలోకి వెళ్లి ఉండే అవకాశం కూడా లేకపోలేదు.

అప్పటిదాకా గీతపై పోరాటానికి సుధారాణికి సహకరిస్తూ వచ్చిన అధినేత చంద్రబాబు.. మెల్లిగా తన వైఖరిని మార్చుకున్నారు.సుధారాణి మాత్రం గీత ఎస్టీ కాదని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. అయితే ఒకే పార్టీ నేతల మధ్య విభేదాలు సరికావని చంద్రబాబు భావించడంతో.. సుధారాణిని ఆయనే వెనక్కి తగ్గేలా చేశారని చెబుతున్నారు. టీడీపీ మద్దతు కరువవడంతో.. ఇక ఒంటరి పోరాటం వృథా అని భావించిన సుధారాణి.. చివరకు పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

వదిలేది లేదంటున్న గిరిజనులు:

అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సుధారాణి వెనక్కి తగ్గినా.. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు అక్కడి గిరిజనులు. పార్టీ అధినేత చెప్పగానే పిటిషన్ ఉపసంహరించుకుంటారా? అని ప్రశ్నించారు. విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకున్నా.. తాము మాత్రం వదిలేది పెట్టేది లేదని అక్కడి గిరిజన సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+