రేవంత్ రెడ్డికి షాక్: గుట్టువిప్పిన మోత్కుపల్లి, టిఆర్ఎస్‌తో టిడిపి సై
2019 ఎన్నికల్లో పొత్తు అంశం తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్‌తో వెళ్లే అంశంపై నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో పొత్తు అంశం తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్‌తో వెళ్లే అంశంపై నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
తాజాగా టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాకిచ్చేవిలా ఉన్నాయి. రేవంత్ ఒకటి ఆలోచిస్తే.. మోత్కుపల్లి మరొకటి ఆలోచిస్తున్నారు.

పొత్తుపై మోత్కుపల్లి ఇలా
ఎన్నికల్లో పొత్తు అంటూ కుదిరితే బిజెపి లేదా అధికార తెరాసతోనే ఉంటుందని, కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఉండదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడైన మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టిడిపి మద్దతు లేకుండా టీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.

గవర్నర్ పదవి లిస్టులో పేరు లేకపోవడం బాధగా ఉంది
తన నివాసంలో మంగళవారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ల జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు. వాస్తవానికి నేను గవర్నర్ పదవి అడగలేదని, రాజ్యసభ ఎంపీ ఇవ్వాలని కోరగా గరికపాటికి ఇచ్చారని, అప్పుడే తనకు గవర్నర్ పదవి వస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. అది నెరవేరుతుందని మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పారు.

మోత్కుపల్లి కుటుంబ సభ్యుల కంటతడి
మూడేళ్లలో తాను ఎక్కడికి వెళ్లిన చాలామంది తనను గవర్నర్‌గానే చూశారని, మొన్నటి జాబితాలో పేరు లేకపోవడంతో దసరా పండుగను కూడా జరుపుకోలేదని, తమ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారని, రాజ్యసభ ఇస్తరని అనుకుంటున్నానని మోత్కుపల్లి చెప్పారు.

మోత్కుపల్లి మాట.. రేవంత్ రెడ్డికి షాక్
ఇదే సమయంలో మోత్కుపల్లి పొత్తుల గురించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌తో వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. తెరాసనే తమ ప్రత్యర్థి అని, బిజెపితో కలిసి వెళ్లే ఉద్దేశ్యం లేదని రేవంత్ గతంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకైనా సిద్ధమని రేవంత్ పలుమార్లు ప్రకటించారు. మోత్కుపల్లి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఇది రేవంత్‌కు షాక్ అని చెప్పవచ్చు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications