కిరణ్ బేడీకి అశ్లీల వీడియో పంపాడు, ఆమె ఏమి చేసిందో తెలుసా

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడికి అధికారిక వాట్సాప్ గ్రూప్ అశ్లీల వీడియోను పంపిన అధికారి శివకుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది.

చెన్నై :పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి అశ్లీల వీడియో పంపాడనే కారణంగా శివకుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుండి తప్పించారు. అధికారిక వాట్సాప్ గ్రూప్ లో ఆమెకు శివకుమార్ అశ్లీల వీడియో ను పంపాడు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అన్ని శాఖల అధికారులతో వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటుచేసింది. ఈ గ్రూపు ద్వారానే అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు ఆమె ఈ గ్రూప్ ను ఏర్పాటుచేశారు.

senior punducherry civil services officer suspended for posting porn video in official what's app group

అయితే పుదుఛ్చేరి లో సహకారసంఘాల రిజిస్ట్రార్ పేరుతో కిరణ్ బేడీకి మూడు పోల్డర్లు వచ్చాయి.అయితే ఇందులో ఒకే ఫోల్డర్లలో అశ్లీల వీడియో వచ్చింది. ఈ వీడియో ను చూసి ఆమె షాక్ కు గురయ్యారు.

ఈ గ్రూపులో ఉన్న అధికారులు కూడ ఈ వీడియో ను చూసి ఖంగుతిన్నారు. ఈ వీడియో తో పాటు సుమారు 30కి పైగా అసభ్య మేసేజ్ లు కూడ ఉన్నాయి. వీటిని పంపిణి అధికారిపై చర్య తీసుకోవాలని కిరణ్ బేడీ పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ ప్రీతాను ఆదేశించారు. సీనియర్ ఎస్ పి రాజీవ్ రంజన్ విచారణ జరిపారు . ఈ విచారణ తర్వాత శివకుమార్ ను శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+