వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌కు కేవీపీలా: చంద్రబాబు కోసం టిడిపి నేతల గాలింపు!

టిడిపికి ఇప్పుడు ఓ అంబుడ్స్‌మెన్ కావాలని చర్చ సాగుతోంది. చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని, ఆయన ఒత్తిడిని తగ్గించేందుకు ఈ అంబుడ్స్‌మెన్ పని చేయాలని టిడిపిలో చర్చ సాగుతోందంటున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: టిడిపికి ఇప్పుడు ఓ అంబుడ్స్‌మెన్ కావాలని చర్చ సాగుతోంది. చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని, ఆయన ఒత్తిడిని తగ్గించేందుకు ఈ అంబుడ్స్‌మెన్ పని చేయాలని టిడిపిలో చర్చ సాగుతోందంటున్నారు.

జగన్ కోసం.. తీగ లాగితే: బాబుకు అడ్డంగా దొరికిన ప్రశాంత్ కిషోర్జగన్ కోసం.. తీగ లాగితే: బాబుకు అడ్డంగా దొరికిన ప్రశాంత్ కిషోర్

చంద్రబాబుకు ఒత్తిడి తగ్గించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు అయితే బాగుంటుందని టిడిపిలో చర్చ సాగుతోందని తెలుస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో బాబుపై సాధ్యమైనంత ఒత్తిడి తగ్గించాలనుకుంటున్నారట.

TDP leaders seeing for best ombudsman to Chandrababu

చంద్రబాబుకు రిలీవ్ కోసం ఎవరో ఒకరు రంగంలోకి రావాలని అందరు నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీరిక లేకుండా ఉంటే కెవిపి రామచంద్ర రావు అన్ని విషయాలను చూసుకునేవారు.

వైయస్ దగ్గరకు వెళ్లలేని వారు కెవిపి వద్దకు వెళ్లేవారు. ఆయనతో చెప్పుకుంటే వైయస్‌కు చెప్పుకున్నట్లేనని భావించేవారు. ఆ విధంగానే చంద్రబాబుకు కూడా ఓ నేత ఉండాలని టిడిపి నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.

ఈ చర్చ జరిగిన తర్వాత అందరి చూపు మంత్రి అచ్చెన్నాయుడు మీదకు పోయిందని తెలుస్తోంది. ఆయన అయితే ఆ పాత్రలో చక్కగా ఉంటారని భావించారని అంటున్నారు. అంబుడ్స్‌మెన్ ఉంటేనే చంద్రబాబుపై ఒత్తిడి తగ్గి పార్టీపై దృష్టి పెడతారని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

English summary
It is said that Telugu Desam Party leaders are seeing for best ombudsman for Andhra Pradesh Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X