బిస్కెట్స్ ఎక్కువగా తింటున్న వారికి హెచ్చరిక!
చాలామంది బిస్కెట్లను ఎక్కువ ఇష్టంగా తింటారు. తరచూ బిస్కెట్లను స్నాక్స్ కింద తినే పిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బిస్కెట్లను తినడం మంచిదేనా? బిస్కెట్లను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
బిస్కెట్స్ తినటం మంచిదేనా?
బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే సహజంగా బిస్కెట్ల తయారీలో మైదా పిండిని ఉపయోగిస్తారు. మైదాపిండి అంత ఆరోగ్యానికి మంచిది కాదు. మైదా పిండిని ఎక్కువగా తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. బిస్కెట్లను ఎక్కువగా తినే వారిలో మలబద్ధకం సమస్య కూడా వస్తుంది.

బిస్కెట్స్ ఎక్కువ తింటే డయాబెటిస్, దంత సమస్యలు
బిస్కెట్లను తయారు చేసేటప్పుడు మైదాతో పాటు పంచదారను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం పంచదారని ఎక్కువగా తినడం కూడా ఏమాత్రం మంచిది కాదు. పంచదారని ఎక్కువగా తినడం వల్ల టైప్ టు డయాబెటిస్ సమస్యలు వస్తాయి. అంతేకాదు పళ్ళు కూడా పాడవుతాయి. దంతాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
బిస్కెట్స్ తయారీలో మైదా, చక్కెరతో పాటు ఇవి కూడా
బిస్కెట్ల తయారీలో ఉపయోగించే మైదాపిండి, చక్కెర, ఉప్పు, ఫ్యాట్స్ ఏవి మంచివి కాదు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది వీటి రుచికి అలవాటు పడిన చాలామంది వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఫలితంగా విపరీతంగా బరువు పెరుగుతారు. వీటిలో ఉండే చక్కెర, ఉప్పు, మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
బిస్కెట్స్ తో ఈ సమస్యలు
బిస్కెట్లలో ఎటువంటి పోషకాలు ఉండవు. బిస్కెట్లను ఫైబర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తింటే పిల్లలు డయేరియా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు బిస్కెట్లలో నీళ్ల శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువగా బిస్కెట్లు తినడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది. అంతేకాకుండా బిస్కెట్లు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, రక్తనాళాలలో రక్త సరఫరా మందగిస్తుంది.
బిస్కెట్స్ విషయంలో జాగ్రత్త
ఫలితంగా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి బిస్కెట్లు తినాలి అనుకునేవారు వాటి వల్ల కలిగే అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిస్కెట్లను తినకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఎప్పుడైనా తిన్న చాలా పరిమితంగా తింటే మంచిది. అలా కాకుండా స్నాక్స్ కింద ఇష్టారాజ్యంగా ప్రతిరోజు బిస్కెట్లను తింటే ఆ తర్వాత కచ్చితంగా బాధపడాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications