7 నెలల్లో 35 కిలోల బరువు తగ్గిన యువతి.. ఇవి తినటం మానేస్తే చాలట!

క్రమశిక్షణ, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు. ఇక ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుకున్నది సాధించింది ఒక యువతి. 91 కిలోల బరువు నుండి ఏకంగా 56 కిలోల ఆరోగ్యకరమైన బరువుకు చేరుకుంది. క్రమశిక్షణ పట్టుదలతో ఆమె చేసిన ప్రయత్నం ఆమె బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేసింది.

బరువు తగ్గాలని యువతి ప్రయత్నం
తన 19 పుట్టినరోజు నాడు తీసుకున్న నిర్ణయం ఆమెను ఏడు నెలల వ్యవధిలో ఏకంగా 35 కిలోల బరువు తగ్గేలా చేసింది. ఇంతకీ ఆమె చేసిన ప్రయత్నం ఏంటి? ఆమెకు బరువు తగ్గడంలో ఏ విధానం దోహదం చేసింది? ప్రస్తుతం తెలుసుకుందాం. 19 ఏళ్ళ యువతి తన ఆరోగ్యాన్ని తానే గాడిలో పెట్టుకోవాలని బలమైన సంకల్పంతో బరువు తగ్గడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.

A young woman lost 35 kg weight in 7 months you could stop eating these for best weight loss

Take a Poll

జిమ్ లకు, ఏరోబిక్స్ సెంటర్లకు వెళ్ళకుండానే బరువు తగ్గిన యువతి
బరువు తగ్గడం కోసం ఆమె జిమ్ లకు, ఏరోబిక్స్ సెంటర్లకు వెళ్లలేదు. కేవలం ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని, ఎటువంటి పరికరాలు అవసరంలేని సాధారణ వ్యాయామాలను క్రమం తప్పకుండా ఆచరించింది. ఇక తను బరువు తగ్గడానికి ముఖ్యమైన కారణం కొన్ని రకాల ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండటమేనని ఆ యువతి తెలిపింది.

కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే వెయిట్ లాస్ సీక్రెట్
హార్మోన్ల సంబంధిత సమస్యతో విపరీతంగా బరువు పెరిగిన ఆమె తాను బరువు తగ్గడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే తన బరువు తగ్గడానికి సీక్రెట్ అని యువతి తెలిపింది .తాను కొన్ని రకాల ఆహారపదార్థాలను పూర్తిగా మానివేశాను అని ఆ పదార్థాల జాబితాను అందరికీ తెలియజేసింది.

ఈ ఆహారాలకు దూరంగా ఉండాలన్న యువతి
కేవలం వీటి వల్లనే బరువు పెరుగుతున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఆమె పేర్కొంది. ఇంతకీ సదరు యువతి పూర్తిగా దూరంగా ఉన్న ఆహారపదార్థాలు ఏమిటంటే శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్లు, కేకులు పేస్ట్రీలు, చిప్స్, బిస్కెట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చక్కెర కలిపిన రెడీ టు ఈట్ తృణధాన్యాలు.

వీటిని ఆహారం నుండి నిషేధించాలన్న యువతి
ఇవి మాత్రమే కాకుండా అధిక కొవ్వు ఉన్న మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో తయారు చేసిన బ్రెడ్, ఇతర పదార్థాలు, ఐస్ క్రీమ్ లు, చాక్లెట్లు, క్యాండీ బార్లు వీటన్నింటిని తాను తన ఆహారం నుండి నిషేధించినట్టు తెలిపింది. ప్రతిరోజు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, ఇంట్లో మనం చేసుకోగలిగే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతామని ఆ యువతి తెలిపింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+