ఈ మొక్క చేస్తుంది అద్భుతం.. ఇది ఇంట్లో ఉంటే అందం, ఆరోగ్యం!

ప్రస్తుతం వందలో 90 మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేది తెగ వెతుకుతున్నారు. మందులతో కాకుండా నేచురల్ గా ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న అంశం. అలాంటి వారు ఇంట్లో కొన్ని రకాల ఔషధ మొక్కలను పెంచుకుంటే మనకు కావలసిన ఆరోగ్య ప్రయోజనాలు వాటిద్వారా పొందవచ్చు అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

కలబందతో ఆరోగ్య ప్రయోజనాలు
ఇప్పటికే రణపాల మొక్క ప్రయోజనాలను గురించి తెలుసుకున్నాం. రణపాల మొక్కను నిరభ్యంతరంగా ఇంట్లో పెంచుకోవచ్చు. ప్రస్తుతం మనం కలబంద మొక్క యొక్క ప్రయోజనాలను కలబంద ఆరోగ్యానికి అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలను తెలుసుకుందాం. కలబంద ఔషధ మొక్క. కలబందను కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాలలోనూ ఎక్కువగా వాడుతారు. కలబంద మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది

Aloe vera plant health benefits it gives beauty and health

కలబంద అనేక అనారోగ్యాలకు దివ్యౌషధం
కలబంద ముఖ్యంగా జీర్ణశక్తిని పెంపొందించడానికి, గుండె ఆరోగ్యానికి, అజీర్ణం వల్ల ఏర్పడే వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కాలిన గాయాలకు కలబంద రసాన్ని వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును తింటే మన కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి. కలబంద గుజ్జుని తినడం వల్ల నోరు శుభ్రం అవుతుంది కలబంద గుజ్జుతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కలబందతో జుట్టు, స్కిన్ ఆరోగ్యం .. నిగారింపు
కలబందను జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. చుండ్రు తగ్గి జుట్టు నల్లగా మెరిసేందుకు కలబంద ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును ముఖానికి, ఒంటికి రాసుకుంటే ముఖం పైన, చర్మం పైన ఉన్న టాన్ తొలగిపోయి చర్మం నిగారింపు సొంతం చేసుకుంటుంది. అందుకే కాస్మోటిక్స్ లో కలబందను కచ్చితంగా వాడతారు.

కలబంద ఇంట్లో పెంచుకోవాల్సిన ఆరోగ్యానిచ్చే మొక్క
సహజసిద్ధమైన చర్మపు మెరుపును కలబంద తిరిగి తీసుకొస్తుంది. పిగ్మెంటేషన్ తొలగించడానికి అన్ని రకాల స్కిన్ కోసం కలబంద బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్ లో కలబంద జ్యూస్, కలబంద జెల్ అందుబాటులో ఉంది, కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్ ను తాగితే చాలాకాలం అనారోగ్యాలు దరిచేరకుండా ఉండొచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలబంద నిజంగా ఇంట్లో ఉండాల్సిన చాలా ముఖ్యమైన మొక్క. మరెందుకాలస్యం.. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+