ఈ పండ్లు ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా? డేంజర్!
చాలామంది ఏవైనా పండ్లు తెచ్చుకుంటే ఫ్రిజ్లో పెట్టుకొని తింటూ ఉంటారు. మార్కెట్లో కొని తీసుకువచ్చిన కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టి తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు ఫ్రిజ్లో పెట్టకూడని పండ్లు ఏమిటి? ఎందుకు వాటిని ఫ్రిజ్లో పెట్టకూడదు? వంటి అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జామ పండ్లు
ఫ్రిజ్లో పెట్టకూడని పండ్లలో జామ పండ్లు ఒకటి. జామ పండ్లు చలి వాతావరణాన్ని తట్టుకోలేవు. వీటిని ఫ్రిజ్లో పెడితే వీటిలో నీటి శాతం తగ్గిపోతుంది. జామపండు రుచి కూడా బాగా పాడైపోతుంది. కాబట్టి వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. వీటిని ఫ్రిజ్ లో పెడితే వాటిలో పోషకాలు పోతాయి.

పనసపండు, అరటిపండ్లు
ఫ్రిజ్లో పెట్టకూడని మరొక పండు పనసపండు. ఇవి ఎండాకాలంలోనే వచ్చే పండ్లు. వీటిని ఫ్రిజ్లో పెడితే వీటి టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే వీటిని ఫ్రిజ్లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో పెట్టకూడని మరొక పండు అరటిపండు. అరటి పండ్లను ఫ్రిజ్లో పెడితే కుళ్ళిపోయినట్టుగా తయారవుతాయి. వాటిని రూమ్ టెంపరేచర్ లోనే ఉంచడం మంచిది.
మామిడిపండు, స్ట్రాబెర్రీలు
ఫ్రిజ్లో పెట్టకూడని మరొక పండు మామిడి పండు. మామిడిపండును ఫ్రిజ్లో పెడితే దాన్ని రుచి మారిపోతుంది. ఎప్పుడు గాలి తగిలే కంటైనర్ లో పెట్టి చీకటి ప్రదేశంలో ఉంచితే వాటి రుచి పోకుండా ఉంటుంది. ఫ్రిజ్లో పెడితే పాడైపోయే మరొక పండు స్ట్రాబెర్రీ. ఫ్రిజ్లో పెడితే స్ట్రాబెర్రీ పండు పైభాగం బాగానే ఉంటుంది. కానీ లోపలి భాగం పాడైపోతుంది. కాబట్టి దీనిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్లో పెట్టకండి .
యాపిల్, పుచ్చపండు ఎక్కువసేపు ఫ్రిజ్ లో పెట్టొద్దు
ఫ్రిజ్లో ఉంచితే పోషకాలు కోల్పోయే మరొక పండు యాపిల్. యాపిల్ పండులో ఉండే క్రియాశీల ఎంజైమ్ ల కారణంగా అవి త్వరగా పండుతాయి. వాటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల అందులో ఉండే పోషకాలు పోతాయి. యాపిల్ పండ్లను కాగితంలో చుట్టి ఉంచితే ఫ్రెష్ గా ఉంటాయి. అంతేకాదు ఫ్రిజ్లో పుచ్చపండును కూడా ఎక్కువ సేపు పెట్టకూడదు. పుచ్చపండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ సేపు ఫ్రిజ్లో పెడితే పాడైపోతాయి.
పండ్లను ఇలా తింటేనే మంచిది
కాబట్టి ఈ పండ్లను ఫ్రిజ్ లో పెట్టకండి. సాధ్యమైనంత వరకు ఫ్రిజ్ లో పెట్టిన పండ్లు కాకుండా సాధారణ వాతావరణంలో ఉన్న పండ్ల లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. బయట సాధారణ వాతావరణంలోనే ఉంచిన ఫ్రెష్ పండ్లను తినండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications