చికెన్ గోంగూర ఇలా చేసి పలావ్ తో తింటే స్వర్గానికి బెత్తెడే దూరం!

మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం కీలక భూమిక పోషిస్తుంది. మనం తినే ఆహారంలో కూరలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి కూరలలో మన శరీరానికి మంచి పోషకాలను ఇచ్చే చికెన్ గోంగూర కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చికెన్ గోంగూర ఏ విధంగా తయారు చేస్తారు. ఎలా చేస్తే రుచిగా ఉంటుంది. తయారీ విధానం ఏంటి అనేది తెలుసుకుందాం.

తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ - ½ కిలో
గోంగూర ఆకులు - 2 కట్టలు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు - 3 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 3-4
మిర్చి పొడి - 1½ టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - ½ టీస్పూన్
గరం మసాలా - ½ టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - 3-4 టేబుల్ స్పూన్లు

andhra style chicken gongura super taste with pulav rice and roti

తయారీ విధానం:
గోంగూర ఆకులను కడిగి నీరు లేకుండా పాన్‌లో వేయించి, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత అందులో చికెన్ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి.

ఇలా వండితే రుచిగా ఉంటుంది
పసుపు, ఉప్పు ,కారం వేసి చికెన్ బాగా ఉడికే వరకు సిమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. చికెన్ మొత్తం తయారయింది అనుకున్న తర్వాత, పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను అందులో వేసి మూత పెట్టి సన్న మంటపైన కొద్దిసేపు ఉడికించాలి.

వీటితో చికెన్ గోంగూర సూపర్ కాంబినేషన్
చివరగా అందులో గరం మసాల వేసి గ్రేవీ చిక్కబడి అందులో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంతే చికెన్ గోంగూర రెడీ అయినట్టే. ఈ చికెన్ గోంగూరను వేడివేడి అన్నంలో గాని పలావ్ , రోటీలో గాని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇందులోకి ఉల్లిగడ్డ సలాడ్, నిమ్మకాయ వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. మరెందుకు ఆలస్యం గోంగూర చికెన్ ట్రై చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+