మైగాడ్.. వారికి వరప్రదాయిని, ఔషధాలు మెండు.. నేరేడు పండు
నేరేడు కాయలో ఉన్నన్ని ఔషధ గుణాలు ఏ కాయలోను ఉండటవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మధుమేహ రోగులకు ఇది వరప్రదాయినిగా చెప్పవచ్చు.
నేరేడు కాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యమైన ఔషధంలా భావిస్తారు. నేరేడు పండు షుగర్ ను నియంత్రించడంలో చాలా తోడ్పడుతుంది. ఈ కాయ మాత్రమే కాకుండా ఆకులు, గింజలు, బెరడులో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తెల్లవారుజామున తింటే దీనివల్ల ఐదు గొప్ప లాభాలున్నాయి.

మధుమేహ రోగులకు వరంలాంటిది
మధుమేహం - ఆహారపు అలవాట్లు మారడం, సమయపాలన లేకుండా భోజనం, బిర్యానీలు తినడం వల్ల చిన్న వయసులోనే అందరూ మధుమేహానికి గురవుతున్నారు. రక్తంలో పెరిగే చక్కెరను నింత్రించడానికి నేరేడు కాయ చాలా ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కలిగి వుండటంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మూత్ర విసర్జన, దాహాన్ని నియంత్రించడంలో నేరేడు సహాయపడుతుంది. గింజలు, బెరుడు, ఆకులు అనేక వంటకాల్లో నిత్యం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత జీవన విధానం అంతా మారిపోయింది. చాలామందిలో రోగనిరోధకశక్తి ఉండక బలహీనపడుతుంటారు. అటువంటివారిలో వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి నేరేడుకాయ మంచి సహాయం చేస్తుంది. శక్తిని పెంచే పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, సోడియం, కార్పొహైడ్రేట్స్, ఐరన్ ఉంటాయి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవమైన గుండెను ఆరోగ్యంగా ఉంచడటంలో నేరేడు పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. పొటాషియం పుష్కలంగా ఉండటంతోపాటు సాధారణ స్పందనను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే క్రమం తప్పకుండా నేరేడుకాయలు తింటుండాలి. పొటాషియం, అధిక రక్తపోటు వల్ల వచ్చే స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్
క్యాన్సర్ నిరోధక లక్షణాలు నేరేడు కాయలో ఉంటాయి. క్రమం తప్పకుండా తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడంతోపాటు ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడడంలో సహాయపడటమేకాదు.. నేరేడులో ఉండే సైనిడిన్ పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే చర్మం మెరుస్తుంటుంది. దీంతోపాటు చర్మం మృదువుగా మారడం ప్రారంభమవుతుంది. చర్మానికి మేలు చేసే విటమిన్ సి ఉంటుంది. చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడటమే కాదు.. దంతాలు, చిగుళ్లు బలపడతాయి.












Click it and Unblock the Notifications