మూత్రంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలెర్ట్!

మూత్ర విసర్జన ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది. మూత్రం రావడం, మూత్రం యొక్క పరిమాణం, దాని స్వభావం, మూత్రం యొక్క రంగు బట్టి మూత్ర విసర్జనను కొన్ని రకాలుగా వర్గీకరించారు. మూత్రం లక్షణాలను బట్టి మూత్ర విసర్జన సమస్యలను కూడా గుర్తించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అతి మూత్ర విసర్జన సమస్య
చాలామందికి మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలా మూత్రం ఎక్కువగా రావడాన్ని పాలీ యూరియా అంటారు. మూత్రం అతిగా రావడం, పదేపదే ముత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రం పరిమాణం కూడా ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను పాలి యూరియా అంటారు. ఈ సమస్య ఎక్కువగా ఉన్నవారు డయాబెటిస్ బాధితులుగా మారతారు.

Are these symptoms visible in urine But be alert

తక్కువ మూత్ర విసర్జన సమస్య
మూత్రం తక్కువగా రావడాన్ని అనురియా అని చెబుతారు. అంటే ఒక మనిషి శరీరంలో ఒక రోజు తయారు కావలసిన మూత్రం కంటే తక్కువ మూత్రం తయారు అయితే ఆ పరిస్థితిని అనురియా అంటారు. అయితే మూత్రం తక్కువ రావడం శరీరం యొక్క డీహైడ్రేషన్ ను సూచిస్తుంది. ఇది కూడా అనారోగ్య సమస్య గానే పరిగణించాలి.

మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ పోవటం
శరీరంలోని వ్యర్ధ పదార్థాలు పోవాలంటే ప్రతిరోజు మన శరీరంలో 300 నుండి 500 మిల్లీమీటర్ల మూత్రం తయారు కావాలి. అంతకంటే తగ్గితే దానిని అనురియాగా పరిగణించాలి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ పదార్థం పోవడాన్ని అల్బుమినూరియా అంటారు. ఈ సమస్య నెప్రైటిస్, డయాబెటిస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, కొంతమందికి కాన్పుకు ముందు వచ్చే గుర్రపు వాతం వంటి సమస్యలతో వస్తుంది.

మూత్రంలో గ్లూకోజ్, రక్తం పోతే
మనిషి శరీరంలో రక్తంలో ఎక్కువ గ్లూకోజ్ ఉంటే మూత్రంలో కూడా గ్లూకోజ్ పోయే పరిస్థితిని గ్లైకోసూరియా అంటారు. ఇక మూత్రంలో రక్తం పోయే పరిస్థితి ఉంటే దానిని హేమచురియా అంటారు. మూత్రపిండంలో రాళ్లు ఉంటే, మూత్రనాళాలకు గాయాలు అయితే లేదా ఏదైనా ఇన్ఫెక్షన్లు వస్తే ఈ సమస్య వస్తుంది. ఇక పుట్టుకతోనే మూత్రపిండాలు జబ్బుల వల్ల, మూత్రపిండాల క్యాన్సర్, ప్రోస్టేట్ సమస్యలు, చికిత్సల కారణంగా కూడా హెమచురియా వస్తుంది.

మూత్రంలో చీము, అనేక మూత్ర సమస్యలు
మూత్రంలో చీము పోయే పరిస్థితిని పయూరియా అంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నడుం నొప్పి, మూత్రం పోసే సమయంలో విపరీతమైన నొప్పి వస్తాయి. ఇది మాత్రమే కాకుండా మూత్రం రంగును బట్టి దాని కల్చర్ ను బట్టి, మూత్రం యొక్క సెన్సిటివిటీని బట్టి మూత్ర సమస్యలను నిర్ధారిస్తారు . ఇక ఇటువంటి అనేక మూత్ర సమస్యలకు నిర్దిష్ట కారణాలను గుర్తించి తదనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+