ఎండలో తిరిగొచ్చి వెంటనే చన్నీళ్ళస్నానం చేస్తున్నారా.. అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండుతున్నాయి. ఉగ్ర భానుడి దెబ్బకు జనాలు విలవిలలాడుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడి పోతున్నారు. చల్లదనం కోసం తెగ పరుగులు పెడుతున్నారు. కొందరైతే ఇళ్లలో ఏసీ రూముల నుంచి బయటకు కూడా రావడం లేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ అనేక ప్రాంతాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, వడగాలులు వేస్తున్నాయి. దీంతో అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు.
ఎండలో తిరిగొచ్చి వెంటనే చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా?
వైద్యులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మండుతున్న ఎండలలో బయట తిరిగి వచ్చిన తర్వాత చల్లటి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావించి, చన్నీళ్ల స్నానం చేసేవారికి ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇప్పటికే ఎండలో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం.

ఎండలో తిరిగొచ్చి వెంటనే చల్లని నీళ్ళు తాగినా, స్నానం చేసినా మంచిది కాదు
విపరీతమైన ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చల్లటి నీళ్లు తాగితే రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంటుందని, మన శరీరం పైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని, ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఉందని తెలుసుకున్నాం.
ఇక ప్రస్తుతం మంచి ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయడం మంచిదేనా? అన్న విషయం గురించి తెలుసుకుంటున్నాం.
బయట నుండి వచ్చిన వెంటనే కాసేపు ఆగాలి ఎందుకంటే
విపరీతమైన ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే చన్నీళ్ల స్నానం చేయడం గాని, చన్నీళ్లతో కాళ్లు కడుక్కోవడం కానీ ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు. ఎప్పుడైనా ఎండలో బయట తిరిగి వచ్చిన తర్వాత శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. మళ్లీ శరీర ఉష్ణోగ్రతను గది ఉష్ణోగ్రత లోకి తీసుకు వచ్చిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి.
చన్నీళ్ళతో స్నానం చేస్తే డేంజర్
బాగా మండుటెండల్లో తిరిగివచ్చి, వచ్చి రావడంతోనే చల్లటి నీళ్లతో స్నానం చేస్తే ఒక్కోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మండుటెండల్లో తిరిగి వచ్చిన తర్వాత చన్నీళ్ళతో స్నానం చేయడం బ్రెయిన్ స్ట్రోక్ కు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు. అంతేకాదు బయట తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే చల్లటి నీళ్ళతో కాళ్ళు కూడా కడుక్కోకూడదు. ఈ విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని తదనుగుణంగా వడదెబ్బ తగలకుండా, ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications