వంకాయ కూర తింటున్నారా.. ఆరోగ్యంపై వంకాయ ప్రభావం తెలుసుకోండి!
వంకాయ కూరను ఇష్టపడని వారు ఉండరు. చాలామంది నిజజీవితంలో తీసుకునే ఆహారంలో వంకాయల తోటి రకరకాల కూరలు వండి తీసుకుంటూ ఉంటారు. అయితే వంకాయలలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. వంకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వంకాయలలో తక్కువ క్యాలరీలు, కొవ్వు , కార్బోహైడ్రేడ్లు ఉంటాయి. వంకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
వంకాయలతో ఆరోగ్యం
వంకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక వంకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. టైప్ టు డయాబెటిస్ తో బాధపడుతున్న వారిలో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. వంకాయలలో పిండి పదార్థాలు ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

వంకాయలతో ఈ సమస్యలకు చెక్
వంకాయలలో ఉండే పొటాషియం శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపి గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. వంకాయలలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం తిన్న తర్వాత కడుపు నిండినట్టుగా ఉంటుంది దీనివల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకోము. ఫలితంగా బరువు కూడా తగ్గుతాము.
వంకాయలతో జీర్ణ సమస్యలకు స్వస్తి
వంకాయలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి. వంకాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వంకాయలు దృష్టి సమస్యలను తగ్గిస్తాయి. వంకాయలలో విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలను తగ్గించడానికి వంకాయలు ఎంతో బాగా ఉపయోగపడతాయి . కండరాలను బలోపేతం చేయడంలో వంకాయలు ఉపయోగపడతాయి.
వంకాయలను వీరు తినకూడదు
అయితే స్కిన్ ఎలర్జీలు ఉన్నవారు వంకాయలను తినకూడదని చెబుతారు. చిన్నచిన్న స్కిన్ అలర్జీలు ఉన్నవారు వంకాయలు తింటే వారికి శరీరంపై దురద స్వభావం పెరుగుతుందని తినడం మంచిది కాదని చెబుతారు. వంకాయలలో వాత స్వభావం ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నవారు తినకూడదు. అయితే వారానికి ఒకసారి వంకాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications