వంకాయ తింటున్నారా? అయితే అలెర్ట్!
చాలామంది వంకాయను ఇష్టంగా తింటారు. కూరగాయలలో రారాజుగా వంకాయను చెప్తారు. వంకాయలలో ఫుల్ పోషకాలు ఉన్నాయని, బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వంకాయను తినడం చాలా మంచిదని చెబుతారు. వంకాయలో ఉండే పిండి పదార్థాలు, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి 3, బి 6, బీటా కెరాటిన్, ఫైబర్ మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని చెబుతున్నారు.
వంకాయను వీరు తినకూడదు
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వంకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని చాలామంది చెబుతున్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వంకాయలను తినకూడదని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వంకాయలను కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తింటే వారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుందని చెబుతున్నారు. మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వంకాయ కూర తినకూడదో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలా... వంకాయ తింటే జరిగిదిదే
చాలామంది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలతో ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు, జీర్ణ సమస్యలతో సతమతమయ్యేవారు వంకాయ కూరను తినకూడదు. వీరు వీలైనంత తక్కువగా వంకాయ కూర తింటే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ కూర తింటే వారి సమస్య మరింత పెరుగుతుంది.
వీరు వంకాయ తింటే డేంజర్
అంతే కాదు రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితిలోనూ వంకాయ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఐరన్ శోషణ తగ్గించే అనేక అంశాలు ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న ఐరన్ ను కరిగిస్తుంది కాబట్టి రక్తహీనత ఉన్నవారు వంకాయ తినకూడదు.
వీరు వంకాయ తింటే ఇబ్బంది తప్పదు
మూత్రపిండాల వ్యాధితో లేదా మూత్రపిండాలలో రాళ్లు తో బాధపడుతున్న వారు వంకాయను తినకూడదు. వంకాయలలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కిడ్నీలలో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతుంది. అంతేకాదు కీళ్ల నొప్పులతో బాధపడేవారు వంకాయలను తినకూడదు. మీరు వంకాయలను తింటే కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి. వంకాయలలో ఉండే సోలనిల్ నొప్పులను. వాపులను మరింత పెంచుతుంది.
వంకాయ తింటే వీరికి అలర్జీలకు చాన్స్
చాలామంది చర్మ సంబంధమైన అలర్జీలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు కూడా వంకాయలను అస్సలు తినకూడదు. వంకాయ కూర తింటే వారికి అలర్జీ మరింత పెరుగుతుంది. వంకాయ మంచి పోషకాలు ఉన్న కూరగాయ అయినప్పటికీ పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు వంకాయలను తినకూడదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక ఆయుర్వేద నిపుణులు వంకాయ తింటే వాతం పెరుగుతుందని, దురదల వంటి సమస్యలకు వాతమే కారణమని అంటున్నారు. ఒకవేళ ఎప్పుడైనా తిన్న చాలా మితంగా తినాలని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications