Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిజ్జాలు, బర్గర్లు తింటున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

చాలామంది ప్రతిరోజూ ఇంట్లో భోజనానికి బదులు బయట ఏవో జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు తింటూ కడుపు నింపుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు పిజ్జాలు, బర్గర్లు తింటే మీరు రిస్క్ లో పడ్డట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిజ్జాలు, బర్గర్లు తింటే జరిగేదిదే
పిజ్జాలు, బర్గర్లు బాగా టేస్టీగా ఉన్నాయని ముఖ్యంగా యూత్ వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే నోటికి టేస్టీగా ఉన్నవి అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో అధికంగా కొవ్వులు, చక్కెర స్థాయిలు ఉంటాయని వీటి కారణంగా హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినే వాళ్ళల్లో ఆరోగ్యపరంగా చాలా మార్పులు వస్తాయని శరీరం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

Are you eating burgers and pizzas then know these facts and health issues

బర్గర్లు తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం
బర్గర్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి ఒకేసారి ఎక్కువ క్యాలరీలు ఉత్పత్తి జరిగి శరీరంలోని కణాల పైన ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. బర్గర్ తినే వాళ్ళల్లో ఊబకాయం వస్తుందని హెచ్చరిస్తున్నారు. చాలామంది బర్గర్లలో రెడ్ మీట్ పెట్టి అమ్ముతూ ఉంటారని ఇక వీటిని తినడం వల్ల సంతృప్త కొవ్వులు శరీరంలో అధికంగా చేరి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఇది లిపో ప్రోటీన్స్ స్థాయిలను పెంచుతుంది.

చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లు
ఫలితంగా చిన్న వయసులోనే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. బర్గర్లు, పిజ్జాలు తినేవాళ్ళల్లో ఇన్సులిన్ నిరోధకత జరుగుతుందని వీరికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇక తరచుగా పిజ్జాలు బర్గర్లు తినే అమ్మాయిలలో చిన్న వయసులోనే పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, మరికొందరిలో ఒబెసిటీ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు.

హార్మోన్ల అసమతుల్యత, హైబీపీ వచ్చే అవకాశం
పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్ అలవాట్ల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో పాటు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడం జరుగుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు పిజ్జాలు, బర్గర్లు తినేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు .

పిజ్జాలు, బర్గర్లతో మూత్రపిండాలలో రాళ్ళు
దీర్ఘకాలంలో పిజ్జాలు, బర్గర్లు తినేవారి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని, అనేక రోగాలకు ఇవి కారణంగా మారుతాయి అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో రోగాల బారినపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరోగ్యానికి హాని కలిగించే పిజ్జాలు, బర్గర్లకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+