మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన, వేడిచేసిన ఆహారం తింటున్నారా? అయితే అలెర్ట్!
కిచెన్లో ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం పెరిగిన తర్వాత మైక్రో వేవ్ ఓవెన్ వినియోగం కూడా బాగా పెరిగింది. చాలామంది మైక్రో వేవ్ ఓవెన్ తో వండిన ఆహారాలను తింటే మంచిదని భావించి ఓపెన్ లోనే అన్ని వండుకొని తింటున్నారు. అయితే మైక్రోవేవ్ ఓవెన్ లో ఆహారాన్ని వండడం వేడి చేయడం వంటివి చేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓవెన్ లో వండిన ఆహారాలలో టాక్సిన్స్
మైక్రోవేవ్ ఓవెన్ లో అన్ని రకాల ఆహారాలు వండడం మంచిది కాదు. ఓవెన్ లో వండిన ఆహారాలలో కొన్నిసార్లు టాక్సిన్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి హాని చేస్తాయి. అంతేకాదు మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహారాలు త్వరగా జీర్ణం కావు. వీటివల్ల జీర్ణసమస్యలు వస్తాయి. మైక్రోవేవ్ ఓవెన్ లో ఆహారం వండడం వల్ల వాటిలో ఉండే పోషకాలు కూడా తగ్గుతాయి. విటమిన్లు, మినరల్స్ లేకుండా పోతాయి.

ఓవెన్ లో వండిన ఆహారాలతో జీర్ణ సమస్యలు
చాలామంది మైక్రోవేవ్ ఓవెన్ ను ఆహారాలు వేడి చేసుకుని తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇలా ఓపెన్ లో వేడిచేసిన ఆహారాలు తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే.. వాటిలో ఏమాత్రం పోషకాలు ఉండవని,ఇవి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైక్రోవేవ్ ఓవెన్ లో వండడం వల్ల లేదా వేడి చేయడం వల్ల ఆహార పదార్థాలలో కొన్నిమార్పులు జరిగి జీర్ణసమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఓవెన్ లో వండిన ఆహారాలతో అనారోగ్య సమస్యలు
అంతేకాదు కొన్ని రకాల ఆహార పదార్థాలలో విషపూరితమైన టాక్సిన్లు ఉత్పత్తి జరిగి అవి మనం తిన్నప్పుడు మన శరీరంలోకి వెళతాయని, ఫలితంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. మైక్రోవేవ్ ఓవెన్ లో ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్ల నుండి ఈ టాక్సిన్స్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఓవెన్ లో వండిన ఆహారాలతో ఈ సమస్యలు
ఇక మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహారం మనం బయట పొయ్యి మీద వండిన ఆహారంలా సమానంగా ఉడికే అవకాశం ఉండకపోవచ్చు. దీనివల్ల ఆహారం పూర్తిగా ఉడకకుంటే అది కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహారం రేడియేషన్ తో ఉడుకుతుంది కాబట్టి అది మన శరీర కణజాలాన్ని వేడెక్కిస్తుందని, దీనివల్ల కళ్ళకు, చర్మానికి ఇబ్బంది రావచ్చని హెచ్చరిస్తున్నారు.
ఓవెన్ వినియోగంలో జాగ్రత్త
కొంతమంది మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహారం తింటే క్యాన్సర్ వస్తుందని కూడా చెబుతారు. దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఏది ఏమైనప్పటికీ కిచెన్లో వంట పనిని సులభం చేయడానికి అందుబాటులోకి వచ్చిన మైక్రోవేవ్ ఓవెన్ మరీ ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటేనే మంచిది.












Click it and Unblock the Notifications