చిన్నారులకు చికెన్, మటన్ లివర్ తినిపిస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
చికెన్, మటన్ లివర్ లో ఎన్నో పోషకాలు ఉంటాయని అవి తింటే ఆరోగ్యమని భావించి చాలామంది వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక చిన్న పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటారు. అయితే చికెన్, మటన్ లివర్లను చిన్నారులకు తినిపించవచ్చా? తినిపిస్తే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
చిన్నారులకు చికెన్, మటన్ లివర్ తినిపించవచ్చా?
చికెన్. మటన్ లివర్ లలో కాడ్మియం, లెడ్ వంటి లోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి పిల్లల యొక్క నరాల వ్యవస్థ పైన, మెదడు పైన తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.కొంతమంది పిల్లలకు చికెన్, మటన్ లివర్ అలర్జీ ఉంటుంది. ఈ అలర్జీ వారికి దురద, కడుపు ఉబ్బరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు కారణం అవుతుంది.

లివర్ పై వాటి ప్రభావం... అది తింటే జరిగేదిదే
ముఖ్యంగా చికెన్ మరియు మటన్ ఉత్పత్తి చేసేటప్పుడు కోళ్లకు మరియు మేకలకు వాడే యాంటీబయాటిక్స్, హార్మోనల్ ఇంజక్షన్ల ప్రభావం కోళ్ళు, మేకల లివర్ పైన కచ్చితంగా ఉంటుందని ఇది పిల్లలకు హాని చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు లివర్లో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసు నుండే ఎక్కువ కొలెస్ట్రాల్ చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
చిన్నారులకు లివర్ తినిపిస్తే జీర్ణ సమస్యలు
అంతేకాదు లివర్ లో ఉండే యూరిక్ యాసిడ్ మూత్రపిండాలపైన భారం పడేలా చేస్తుంది. ఇక చిన్నపిల్లల జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. వారికి లివర్ తినిపించడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలకు లివర్ తినిపిస్తే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక చిన్నపిల్లలకు ఈజీగా జీర్ణమయ్యే మంచి పౌష్టికాహారాన్ని ఇస్తే మంచిది.
చిన్నపిల్లలకు లివర్ అలవాటు మంచిది కాదు
కేవలం లివర్లో శరీరానికి కావలసిన అన్ని పోషకాలు లభించవు. ఇదే సమయంలో చిన్న వయసు నుండి చిన్నారులకు నాన్ వెజ్ లో ఈ తరహా ఆహారపు అలవాట్లు చేయడం మంచిది కాదు. కాబట్టి చిన్నపిల్లలకు లివర్ తినిపించడం వల్ల వచ్చే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వారికి లివర్ తినిపించకుండా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు












Click it and Unblock the Notifications