డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ అవయవాలకు తీవ్రనష్టం.. జాగ్రత్త!
డయాబెటిస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేయకూడదని డయాబెటిస్ కారణంగా మన శరీరంలోని అవయవాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తే ఏ అవయవానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రస్తుతం తెలుసుకుందాం.
డయాబెటిస్ తో గుండె జబ్బుల సమస్య
డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తే, శరీరంలో షుగర్ లెవల్స్ ను నియంత్రించకపోతే ఆరోగ్యానికి తీవ్రమైన చేటు చేకూరుతుంది. డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారిలో గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ స్థాయిని అమాంతం పెంచడంతోపాటు రక్తపోటును, హార్ట్ బీట్ ను కూడా పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బుల సమస్య వచ్చే అవకాశం ఉంది.

డయాబెటిస్ తో స్కిన్ అలెర్జీలు, ప్రేగులపై ప్రభావం
డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్కిన్ ఎలర్జీ లతో బాధపడాల్సి వస్తుంది. డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తే పళ్ళ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దంత క్షయం తో బాధపడాల్సి వస్తుంది. ఇక షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యకపోతే ప్రేగుల పై కూడా ప్రభావం పడుతుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లాంటి సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.
లివర్, అర్ధరైటిస్ సమస్యలు
శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయకపోతే శరీరంలోని క్లోమం ఒత్తిడికి గురై ఇన్సులిన్ నిరోధకత కలుగుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే కాలేయం పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే కీళ్ల వాపులు వస్తాయి. ఆర్ధరైటిస్, కీళ్ల నొప్పులు మరింత తీవ్రమై ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేకపోతే మెదడు పైన కూడా ప్రభావం ఉంటుంది.
నరాలు, మూత్రపిండాల సమస్యలు
నరాల సమస్య వస్తుంది. డయాబెటిస్ ను పట్టించుకోకుండా ఉంటే మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications