ఆహారంలో దీనిని చేర్చుకుంటే రోగాలు పరార్!
చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నొప్పులు, వాపులు, జీర్ణ సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఒక మంచి అద్భుతమైన పదార్థం . మీ ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక ఆ పదార్థం ఏమిటి? దానిని ఎలా ఉపయోగించాలి? ప్రస్తుతం తెలుసుకుందాం.
ఆహారంలో ఇంగువతో బోలెడు లాభాలు
అనారోగ్యంతో బాధపడేవారు ఆహారంలో కొంచెం ఇంగువను చేర్చుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంగువ ఆహారం రుచిని బాగా పెంచుతుంది. శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇంగువ అనేక అద్భుత గుణాలున్న ఆయుర్వేద మొక్క నుండి తయారు చేస్తారు. ఫెరులా అని పిలిచే మొక్క కాండం, వేర్ల నుంచి వచ్చే రసంతో ఇంగువను తయారు చేస్తారు.

ఇంగువతో నొప్పులు, వాపులు మాయం
ఇంగువ పేగు కండరాలను బలోపేతం చేయడంలోనూ, గ్యాస్ సమస్యలను, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలోనూ ఎంతో బాగా పనిచేస్తుంది, నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇంగువ ఎంతో కీలక భూమిక పోషిస్తుంది. ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరకణాలకు కలిగే నష్టం నుండి మనలను కాపాడతాయి.
శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం
సాంప్రదాయ వైద్యంలో ఇంగువను ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. శ్వాసకోశ సమస్యలను తగ్గించటానికి ఇంగువ ఎంతగానో దోహదం చేస్తుంది. ఆహారంలో ఇంగువ తీసుకోవడం మాత్రమే కాదు, గోరువెచ్చని నీటితో కూడా ఇంగువను తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రతిరోజు మనం ఇంగువను తీసుకుంటే అది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఇంగువతో ఇన్ఫెక్షన్లు దూరం
ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే అసౌకర్యాలను పరిష్కరించడంలో ఇంగువ ఎంతో బాగా పనిచేస్తుంది. ఇంగువలో ఉండే యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు మన గర్భాశయ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది.












Click it and Unblock the Notifications