కీళ్ళ నొప్పులతో ఈ ఆహారాలు తింటున్నారా? నరకం చూస్తారు జాగ్రత్త!
చాలామంది ప్రస్తుత సమాజంలో కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. శరీరంలోని రెండు ఎముకల జాయింట్ల వద్ద కలిగే నొప్పి, మంట, వాపు వంటి వాటిని కీళ్ళనొప్పులుగా చెప్తారు. వీటినే ఆర్ధరైటిస్ అంటారు. ప్రస్తుతం చాలా తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ల నొప్పులు ఉన్నవారు వాటిని తగ్గించుకోవడానికి వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవడం మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవాలి.
కీళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆహారాలు తినొద్దు
ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తింటే కీళ్ల నొప్పులు మరింత తీవ్రతరమై జీవితం దుర్భరంగా మారుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఎటువంటి ఆహారాలను నివారించడం మంచిది. ఏమి తినకుండా ఉంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తినకూడదు.

ఈ ఆహారాలతో కీళ్ళనొప్పులు తీవ్రం
చక్కెర అధికంగా ఉండే ఆహారాలను, డీప్ ఫ్రై చేసిన ఆహారాలను, జంక్ ఫుడ్స్ ను తినకుండా ఉండడం మంచిది ఈ ఆహారాలతో కీళ్ల నొప్పులు తీవ్రతరం అవుతాయి. రెడ్ మీట్ ను, వేయించిన ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. ఈ ఆహారాలలో చక్కెర, ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి నొప్పిని, వాపును పెంచుతాయి.
ఇవి తీసుకున్నా సరే కీళ్ళ నొప్పులు బాధిస్తాయి... జాగ్రత్త
అంతేకాదు కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు కొన్ని పాల ఉత్పత్తులను తీసుకోకుండా ఉంటే మంచిది .ముఖ్యంగా జున్ను, వెన్న వంటి వాటిని తినకుండా ఉంటే మంచిది. ఇవి కీళ్ల నొప్పులను మరింత పెంచుతాయి. మద్యం తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు, వాపులు పెరుగుతాయి. మద్యం తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీటిని తీసుకోకుండా ఉంటేనే మంచిది.
ఉప్పు, సంతృప్త కొవ్వులు, ప్యూరిన్ ల విషయంలో జాగ్రత్త
అంతేకాదు తీసుకునే ఆహారంలో అధికంగా ఉప్పు ఉన్నా, అధికంగా సంతృప్త కొవ్వులు ఉన్నా, అధికంగా ప్యూరిన్ లు ఉన్న ఆహారం తీసుకుంటున్నా ఇవి కీళ్లనొప్పుల సమస్యను మరింత పెంచుతాయి. కూల్ డ్రింకులు కూడా కీళ్ల నొప్పుల ప్రమాదాన్ని పెంచుతాయి. కనుక కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది.












Click it and Unblock the Notifications