చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆయుర్వేద చిట్కాలు!
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు చాలామందికి అతి పెద్ద సమస్యగా మారింది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి .ముఖ్యంగా గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యతోనే వస్తుంది. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడితో కూడుకున్న జీవితం వెరసి లెక్కకు మిక్కిలి చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆయుర్వేద చిట్కాలు
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు చాలా ఆయుర్వేదిక చిట్కాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆయుర్వేద మూలికలతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు. మరి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే యా ఆయుర్వేద మూలికలు, దివ్య ఔషధాలు ఏమిటో తెలుసుకుందాం.

గుగ్గిలం
ఆయుర్వేదంలో అద్భుత గుణాలు ఉన్న గుగ్గిలంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. గుగ్గిలంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే గుగ్గిలం వాడే విషయంలో ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.
శొంఠి
శొంఠిలో మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పనికి వచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.శొంఠి తీసుకోవడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. జీర్ణ సమస్యలు పరిష్కరించబడతాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పసుపును తీసుకోవడం వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
త్రిఫల
ఆయుర్వేదంలో త్రిఫల ఎంతో అద్భుతమైన ఔషధం. త్రిఫల లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను కలిపి త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తారు త్రిఫల చూర్ణాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
అశ్వగంధ
ఆయుర్వేదంలో అశ్వగంధ కు కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అశ్వగంధలో ఉండే పోషకాలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పాలతో కలిపి అశ్వగంధను తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెంతి నీరు
మెంతి నీళ్లలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రతిరోజు మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications