ఈ కూల్ వెదర్‌లో హాట్ హాట్ "అరటి కాయ బజ్జీ"లు ట్రై చేస్తారా..?
ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ ఊదు పూటల్లో ఆహారాన్ని శరీరానికి అందిస్తూ ఉంటాం. వీటితో పాటు సాయంత్రం వేళల్లో చిరుతిండి అనేది కూడా కాస్త ఉపశమనంగా ఉంటుంది. రోజు మొత్తం పనుల తర్వాత మనకు వచ్చే చిన్న విరామం లాగా.. శరీరానికి-మనసుకు ఉత్సాహం ఇచ్చే సమయం లాగా ఉంటుంది. ఒక్కోసారి ఒక కప్పు టీ లేదా కాఫీతో పాటు ఇష్టమైన చిరుతిండి ఉంటే అలసట తగ్గి రోజంతా చేసిన పనికి ఒక సంతృప్తి కలుగుతుంది. అందుకే ఇళ్లలో సాయంత్రపు స్నాక్స్ రకరకాలుగా ఉంటాయి.
కొందరు పండ్లు, వేపిన శెనగలు, మొక్కజొన్న, మొలకెత్తిన పప్పులు వంటి ఆరోగ్యకరమైనవి ఇష్టపడితే.. మరికొందరు బజ్జీలు, పకోడీలు, సమోసాలు, కట్లెట్స్, సాండ్విచ్ లాంటి క్రిస్పీ స్నాక్స్‌ను ఆస్వాదిస్తారు. వాతావరణాన్ని బట్టి కూడా స్నాక్ ఎంపిక మారుతుంది. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి బజ్జీలు మరింత రుచిగా అనిపిస్తాయి. ఇక ఈ కూల్ వెదర్ లో.. మిర్చీ బజ్జీలు, ఉల్లి బజ్జీలే కాకుండా ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా ట్రై చేయాలంటే అందుకు మంచి స్నాక్ అరటికాయ బజ్జీలు అని చెప్పొచ్చు. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే సులభంగా తయారుచేసుకునే బజ్జీలు పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతాయి. వీటిని ఈజీగా ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

అరటికాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు..
అరటికాయలు - 5
శనగపిండి - 2 కప్పులు
బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీ స్పూన్
వాము పొడి - 2 టీ స్పూన్లు
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
ధనియాల పొడి - 1 టీ స్పూన్
కస్తూరి మెంతి - 1 టేబుల్ స్పూన్ (క్రష్ చేసినది)
వంటసోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత
( పచ్చిమిర్చి పేస్ట్ లేదా అల్లం పేస్ట్ కొంచెం కలిపితే మరింత స్పైసీ టేస్ట్ ఇస్తుంది )
తయారీ విధానం..
ముందుగా అరటికాయల చివరలను కట్ చేసి, పీలర్‌తో చెక్కును తీసేయాలి. అనంతరం ఉప్పు కలిపిన నీటిలో బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని క్రాస్‌గా లేదా పలుచగా ముక్కలుగా కోసుకోవాలి. రంగు మారకుండా ఉండేందుకు, కోసిన ముక్కలను ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టాలి.
ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లో శనగపిండి, బియ్యప్పిండి వేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, వాము పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
తర్వాత క్రష్ చేసిన కస్తూరి మెంతి, చిటికెడు వంటసోడా వేసి మళ్లీ కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, బజ్జీలకు సరిపడా మిడియం కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని కలుపుకోవాలి. ( పిండి మరీ పలుచగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు )
ఇప్పుడు ఉప్పు నీటిలో ఉంచిన అరటికాయ ముక్కలను బయటకు తీసి, తడి లేకుండా శుభ్రమైన క్లాత్‌తో తుడవాలి. ఆ తర్వాత వాటిని సిద్ధం చేసుకున్న బజ్జీ పిండిలో వేసి, ప్రతి ముక్కకు పిండి సమంగా పట్టుకునేలా జాగ్రత్తగా కలపాలి.
స్టవ్‌పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక, పిండిలో ముంచిన అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా నూనెలో వేయాలి.
మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు క్రిస్పీగా వేయించాలి.
వేయించిన బజ్జీలను టిష్యూ పేపర్ పరచిన ప్లేట్‌లోకి తీసి, అదనపు నూనె పీల్చుకునేలా చేయాలి.
ఈ అరటికాయ బజ్జీలను కొత్తిమీర చట్నీ లేదా టమాటా సాస్తో వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది. పిల్లల కోసం కాస్త తక్కువ కారం, పెద్దల కోసం కాస్త ఎక్కువ స్పైసీగా పిండి తయారు చేయవచ్చు. బయట వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లని సాయంత్రం టీతో పాటు ఇవి అద్భుతంగా సరిపోతాయి.
-
చేపలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు.. -
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!











Click it and Unblock the Notifications