బార్లీ నీళ్ళతో మీ బాడీలో మిరాకిల్స్ జరుగుతాయ్!
మన శరీరానికి పోషకాలు అందించే వాటిలో సహజసిద్ధమైన ఔషధం లాంటిది బార్లీ. బార్లీ శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది . ఇందులో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. బార్లీలో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, రాగి, జింక్ వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
బార్లీ నీళ్ళతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్
బార్లీ గింజలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మన శరీరంలో అధిక మొత్తంలో ఉన్న నీటిని బార్లీ గింజలు తొలగిస్తాయి. మనకు మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. బార్లీ గింజలను లేత గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించుకొని పొడిచేసుకుని ఆ పొడిని మూడుకప్పుల నీళ్లలో రెండు చెంచాల మేర వేసి, ఉండలు కాకుండా కలిపి పది నిమిషాలు ఉడికించి చల్లార్చుకోవాలి.

బార్లీ నీళ్ళతో ఈ రోగాలకు చెక్
ఆ నీళ్ళను వడగట్టుకుని అందులో పావు గ్లాసు పలుచని మజ్జిగ చిటికెడు ఉప్పుతో కలిపి తీసుకుంటే బార్లీ నీళ్లు చాలా ప్రయోజనాలను ఇస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు బార్లీ నీళ్లు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. బార్లీ నీళ్లు తాగిన వారికి షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. ఇక బార్లీ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది .
బార్లీ నీళ్ళు మంచి డిటాక్స్ డ్రింక్
బార్లీ నీళ్ళు మంచి డిటాక్స్ డ్రింక్ లాగా ఇది పనిచేస్తుంది. బార్లీ లోని యాంటీ ఆక్సిడెంట్లు అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. అంతేకాదు బార్లీలో ఉండే టోకోఫెరోల్ అనే సమ్మేళనం మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా రక్షణ నిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే శక్తి ఉన్న బార్లీ నీళ్ళకు బరువును తగ్గించే గుణం ఉంది. బార్లీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
బార్లీ నీళ్ళతో ఈ బెనిఫిట్స్ కూడా
బార్లీ నీళ్లతో జీర్ణ క్రియ మెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో బార్లీ నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. బార్లీ లోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications