Beauty tips: రూపాయి ఖర్చులేని సినీతారల సౌందర్య రహస్యం ఇదే; మీరూ ట్రై చెయ్యండి!!

అందంగా ఉండాలని, యవ్వనంగా కనిపించాలని ఎవరు కోరుకోరు.. ప్రతీ ఒక్కరూ అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అలా ఉండటం అందరికీ సాధ్యం కాదు. కానీ చాలామంది సినీ తారలు వయసు పెరుగుతున్నప్పటికీ యవ్వనంగా, అందంగా కనిపిస్తారు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే సినీ తారలు నిత్యం తప్పనిసరిగా చేసే రూపాయి ఖర్చు లేని ఒక సింపుల్ పని వారి ముఖాన్ని అందంగా ఉండేలా చేస్తుంది.

వారి వయసును 10 సంవత్సరాలు తగ్గిస్తుంది. వారి చర్మం నిగారింపును సొంతం చేసుకునేలా, ముడతలు లేకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. సినీ తారలు ప్రతిరోజు తమ ముఖం అందంగా ఉండడం కోసం ఏం చేస్తారంటే.. ప్రతిరోజు ఉదయాన్నే వారు వారి ముఖాన్ని ఐస్ వాటర్ లో మునిగేలా ఐదు నుండి పది సెకండ్ల పాటు, అనేకమార్లు డిప్ చేస్తారు.

Beauty tips: this is the beauty secret of film stars with ice water

ఒక గిన్నెలో ఐస్ వాటర్ తీసుకుని ఆ ఐస్ వాటర్లో ముఖాన్ని ముంచి చర్మాన్ని కొన్ని సెకండ్ల పాటు చల్లని ఉష్ణోగ్రతకు గురిచేస్తారు. ఇది చర్మానికి బహుళ ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఇలా ఐస్ వాటర్ ఫేస్ డిప్ ను ధర్మో జెనిసిస్ అని అంటారు. ఇది శతాబ్దాలుగా మన భారతదేశంలో ఉపయోగిస్తున్న ఐస్ థెరపీనే.

బాలీవుడ్ సినీ తారలైన కత్రినా కైఫ్, తమన్నా భాటియా, అలియా భట్ ఇలా చాలామంది సినీ తారలు ప్రతిరోజు లేవగానే ఐస్ వాటర్లో తమ ముఖాన్ని డిప్ చేస్తారు. దీనివల్ల ముఖ చర్మం పై ఉండే ముడతలు తగ్గిపోతాయి. చర్మం టైట్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ముఖం వాపు తగ్గిపోతుంది. ముఖం యవ్వనాన్ని సంతరించుకుంటుంది.

వాటర్ లో ముఖాన్ని ముంచటం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. చర్మం బిగుతుగా లేనట్లయితే ఈ ఐస్ వాటర్ ఫేస్ డిప్ బాగా ఉపయోగంగా ఉంటుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తొందరగా దగ్గరికి రావు. కాకుంటే నిత్యం చేయటం మానుకోకూడదు. అయితే ముఖంపై, చర్మంపై మరే ఇతర ఇబ్బంది ఉన్నా వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకే ఐస్ వాటర్ ఫేస్ డిప్ చెయ్యాలి.

disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+