Beauty tips: ముఖంపై అవాంఛిత రోమాలు పోవాలంటే ఏం చెయ్యాలంటే!!
చాలామంది ముఖంపైన అవాంఛిత రోమాలతో తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మహిళల్లో అయితే ముఖం పైన అవాంఛిత రోమాలు చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటాయి. మూతి పైన, గడ్డం దగ్గర అవాంచిత రోమాలు పెరగడం వారిని ఆత్మ న్యూనత భావానికి గురిచేస్తుంది.
అవాంచిత రోమాలను తొలగించడం కోసం వ్యాక్సింగ్ చేస్తుంటారు. అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ అవాంచిత రోమాలు పెరగడం ప్రారంభిస్తాయి. అయితే వాటిని తొలగించుకోవడానికి కొన్ని వంటింటి చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక చెంచా శనగపిండి కి, మూడు చెంచాల పాలు వేసి పేస్ట్ ను సిద్ధం చేసుకుని దానిని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత రుద్ది శుభ్రం చేసుకోవడం వల్ల అవాంచిత రోమాలు తొలగిపోతాయి.
అంతేకాదు ముఖం పైన, మూతి మీద ఉన్న నలుపు కూడా పోతుంది. గుడ్డులోని తెల్లసొనలో 1 టీ స్పూను అలోవెరా జెల్ కలిపి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి, ఆరిపోయిన తరువాత శుభ్రం చేసుకుంటే కూడా అవాంచిత రోమాలు పోతాయి. పచ్చి బంగాళాదుంప రసంలో తేనె మరియు నిమ్మరసం కలిపి దానిని ముఖానికి పట్టించి, బాగా ఎండనిచ్చి, ఆపై శుభ్రం చేసుకోవడం వల్ల కూడా అవాంచిత రోమాలు తగ్గుతాయి.
పసుపు, తేనెను కలిపి పేస్టులా చేసుకుని, ఈ పేస్టును ముఖానికి పట్టించి, బాగా ఆరిపోయిన తర్వాత రుద్దుతూ శుభ్రం చేస్తే కూడా అవాంచిత రోమాలు పోతాయి. కొందరు అవాంచిత రోమాలు తొలగించుకోవడం కోసం ఫేస్ మాస్క్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఫేస్ మాస్క్ వేసుకునేటప్పుడు, దానిని సరైన విధానంలో వేసుకోవాలి. ఫేస్ మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసి ఆపై ఫేస్ మాస్క్ వేయాలి.
తర్వాత కొంతసేపు దానిని ఉంచి మాస్క్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత నిదానంగా తొలగించాలి. ఫేస్ మాస్క్ వేసి, క్లీన్ చేసిన తర్వాత ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. దీనివల్ల చర్మం పాడవుతుంది. కాబట్టి అవాంఛిత రోమాల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సమస్య నుండి బయట పడటం కోసం ఈ నేచురల్ రెమెడీస్ ని ట్రై చేయండి. ఇవి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి.













Click it and Unblock the Notifications