బీరును ఎప్పుడైనా శరీరానికి పూసుకున్నారా?
టిక్ టాక్ లో బీర్ టానింగ్ అనేది ట్రెండ్ అవుతోంది. అయితే దీనిని ప్రయత్నించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.స్త్రీ పురుషులిద్దరూ ఎవరికివారుగా అందంగా కనపడటానికి ప్రయత్నిస్తుంటారు. చర్మాన్ని అందంగా, మృదువుగా మార్చుకోవడం కోసం బీర్ షవర్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
బీర్ తో స్నానం చేయడం. బీరును శరీరం అంతా రుద్దుకొని సూర్యరశ్మిలో ఉంటారు. దీనికోసం బీచ్ లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. సూర్య రశ్మి, ఆల్కహాల్ వల్ల చర్మం అందంగా తయారవుతుందని భావిస్తున్నారు. చర్మాన్ని మెరిసేలా చేయడానికి బీర్లోని హాప్ లు, మెలనిన్ ను సక్రియం చేసేందుకు సహాయపడతాయి. బీర్ టానింగ్ సాధారణ పద్దతే అయినప్పటికీ ఆరోగ్యంపై హానికర ప్రభావాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మాన్ని దెబ్బతీయడమే కాకుండా చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

బీర్ షవర్ అలర్జీకి దారితీస్తుంది. చర్మం ఎరుపురంగలోకి మారి అలెర్జీ వస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. చర్మం పొడిగా మారి దెబ్బతింటుంది.చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. చర్మవ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.పీహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. చర్మం పొడిబారుతుంది. పొడిబారి వడదెబ్బకు గురవుతారు. నిర్జలీకరణంవల్ల వృద్ధాప్య ఛాయలు వస్తాయి.
బీరులో హాప్స్, బార్లీ, ఈస్ట్ లాంటి పదార్థాలుంటాయి. బీర్ టాన్ చేయడంవల్ల కొంతమంది వ్యక్తులు అలెర్జీకి గురవుతారు. బీరును నేరుగా చర్మానికి అప్లై చేయడంవల్ల ఎరుపురంగులోకి మారుతుంది. అలెర్జీ ప్రమాదం పెరుగుతుంది. బీరు చర్మానికి పూసినప్పుడు తేమను తొలగిస్తుంది. అప్పుడు చర్మం పొడిగా మారి సూర్యరశ్మివల్ల దెబ్బతినే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని బీర్ టానింగ్ కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications