బీరకాయ, ఎగ్ కూర ఇలా చేస్తే సూపర్ టేస్ట్.. ఆరోగ్యానికి ఇది బెస్ట్!
మనం తినే ఆహారంలో కూరలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. మనం అన్నం కంటే కూరలను ఎక్కువగా తిన్నప్పుడే ఆ పోషకాలు మన శరీరానికి అందుతాయి. అలా మన శరీరానికి మంచి పోషకాలను అందించే కూర బీరకాయ కోడిగుడ్డు. మరి ఈ కూరను ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
బీరకాయ - పావు కిలో తరిగిన ముక్కలు
గుడ్లు - 3
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు -1/2టీస్పూన్
కారం - 1 1/2 టీస్పూన్ (రుచికి తగినంత)
ఉప్పు- 1 1/2 టీ స్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - ½ టీస్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్లు
పోపు గింజలు- స్పూను
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద పాన్‌లో నూనె వేడి చేసి, అందులో పోపు గింజలు వేసి ఆపై పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో మూడు కోడిగుడ్లను కొట్టి పోయాలి. కోడిగుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత, అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేయాలి.
ఇలా చేస్తే సూపర్ టేస్ట్.. ఆరోగ్యానికి బెస్ట్
ఆపై పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి . సిమ్ లో పెట్టి బాగా ఉడికించాలి. బీరకాయ, గుడ్డు బాగా ఉడికి కూర రెడీ అయిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని అన్నంలో గాని చపాతీలో గాని తింటే చాలా బాగుంటుంది. దీనితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కూర తింటే కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ క్రియ బాగా జరుగుతుంది.ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.












Click it and Unblock the Notifications