ఆరోగ్యమే కాదు అందం కూడా ఇచ్చే సెలబ్రిటీలు తాగే జ్యూస్ ఇదే!!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అటువంటి ఆరోగ్యం కోసం మనం మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు మనం మన ఆహారంలో కొన్ని రకాల జ్యూస్ లు తాగితే లాభం చేకూరుతుంది. అలాంటి వాటిలో బీట్ రూట్ జ్యూస్ ఒకటి. బీట్ రూట్ దుంప రకానికి చెందినది.
బీట్ రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతిరోజు మనం బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు. బీట్ రూట్ లో ఉండే పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తున్నారు. బీట్ రూట్ రంగు ఏ విధంగా ఉంటుందో దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే బాగుంటాయి. బరువు తగ్గాలి అనుకున్నా, రక్తహీనత పోవాలన్నా, గుండె సమస్యల నుంచి బయట పడాలన్న ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం
చాలామంది సెలబ్రిటీస్ ప్రతిరోజు బీట్ రూట్ జ్యూస్ తాగుతారు. బీట్ రూట్ లో ఉండే పోషకాలు విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తో పాటు అనేక పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్ రూట్ జ్యూస్ తాగే వారిలో గుండె పనితీరు మెరుగు పడుతుంది. బీట్ రూట్ జ్యూస్ గుండె సమస్యలను తగ్గించడమే కాకుండా, హైబీపీ తదితర సమస్యల నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.
చర్మ ఆరోగ్యానికి బీట్ రూట్
ఎముకలను దృఢంగా ఉంచే శక్తి బీట్ రూట్ జ్యూస్ లో ఉంది. మన చర్మాన్ని కాంతివంతం చేయడానికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. గోళ్ళు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బీట్ రూట్ జ్యూస్ తాగితే మంచిది. శారీరక దృఢత్వం కోసం బీట్ రూట్ జ్యూస్ తాగినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
బీట్ రూట్ జ్యూస్ తాగితే బరువుకు చెక్
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. మన కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది బీట్ రూట్ జ్యూస్. ప్రతిరోజు ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా బీట్ రూట్ జ్యూస్ ను తాగటం అలవాటు చేసుకోవాలి. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది.
బీట్ రూట్ తో జ్ఞాపకశక్తి
మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. అలసట లేకుండా రోజంతా మనం ఉత్సాహంగా ఉండే విధంగా ఇది చేస్తుంది. బీట్ రూట్ జ్యూస్ తాగితే మన జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు. మెదడుకు రక్త సరఫరా బాగా జరిగి మెదడు షార్ప్ గా పని చేస్తుందని కూడా చెబుతున్నారు. మన చర్మం నిగారింపును సొంతం చేసుకోవడానికి కూడా బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతిరోజు మన ఆహారంలో బీట్ రూట్ ను భాగంగా చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications