మహిళలకు చిరాకు కలిగిస్తున్న పొట్ట సమస్య.. మూడునెలలు ఇలా చేస్తే మాయం!!
ఇప్పుడు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. పొట్ట చుట్టూ కొవ్వు చేరి బాన కడుపుతో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న వారు బోలెడు మంది ఉన్నారు. ముఖ్యంగా మహిళల్లో కూడా ఈ పొట్ట సమస్య ఎక్కువగా ఉంటుంది.
మహిళల్లో పొట్ట సమస్య
శారీరక శ్రమ లేకపోవడం, ఆఫీసుల్లోనూ, ప్రయాణాలలోనూ గంటల తరబడి కూర్చొని ప్రయాణం చేయడం సరిగ్గా నిద్రపోకపోవడం, అనవసరపు టెన్షన్లు, ఆహారంలో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల ఈ పొట్ట సమస్యను మహిళలు ఎదుర్కొంటున్నారు. మహిళల్లో ఈ పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

పొట్ట తగ్గాలంటే మహిళలు చెయ్యాల్సింది ఇదే
మహిళల్లో పొట్ట తగ్గాలంటే ముందు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు అయినా శారీరక శ్రమ ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడానికి సమయం కేటాయించుకోగలగాలి. కచ్చితంగా ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవాలి. వారంలో మూడు రోజులపాటు ఏరోబిక్ ఎక్సర్సైజులు, మిగతా రెండు రోజులు బరువులు ఎత్తే, శక్తినిచ్చే శారీరక వ్యాయామాలు చేయాలి.
ఆహారంలో ఇవి తినకండి.. పొట్ట పెరుగుతుంది
శారీరక వ్యాయామంతో పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. ప్రతిరోజు సమయానుకూలంగా నిద్రపోతే శరీరంలోని మెటబాలిజం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆహారం విషయానికి వస్తే స్వీట్లు, కేకులు, చక్కెర, బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తీసుకోకూడదు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పాలిష్ చేసిన బియ్యం, అటుకులు వంటి వాటిని ఆహారంలో తీసుకోవడం తగ్గించాలి.
ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి.. పొట్ట తగ్గుతుంది
తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అన్నం తక్కువ క్వాంటిటీలో తినాలి. దాని బదులు పప్పులు, తృణధాన్యాలు, సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి ఒక పూట తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని మరొక పూట పప్పు దినుసులతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే పొట్ట బాగా తగ్గుతుంది.
మూడు నెలలు చేస్తే బెస్ట్ రిజల్ట్స్
మూడు నెలల పాటు ఈ విధానాన్ని పాటిస్తే మీ లైఫ్ స్టైల్ ను ఈ విధంగా చేంజ్ చేసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడం మాత్రమే కాకుండా మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది శరీరకంగా మీ ఉత్సాహం పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications