బెంగాలీ స్పెషల్ "లిక్కర్ టీ".. వర్షాకాలంలో వేడివేడిగా తాగితే ఫుల్ కిక్కు..!

పొద్దున్నే లేచి ఓ కప్పు టీ తాగందే ఏ పనీ స్టార్ట్ చేయని వారు చాలా మందే ఉంటారు. అలా రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో లెక్కే ఉండదు. అయితే ఎప్పుడూ తాగే టీ, కాఫీలు తాగి బోర్ కొట్టిందా.. అయితే ఈ లిక్కర్ టీ ను ఓ సారి ట్రై చేయండి. వర్షాకాలంలో వేడివేడిగా ఈ టీ తాగితే ఆ మాజాయే వేరప్పా అంటారు. మనం ఇరానీ చాయ్, గ్రీన్ టీ, జింజర్ టీ, హెర్బల్ టీ ఇలా ఎన్నో రకాల టీలను తాగాం. కానీ లిక్కర్ టీ మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ఈ టీ తాగితే స్వర్గంలో తేలినట్లు ఉంటుంది. మరి ఈ లిక్కర్ టీ ఎలా చేసుకోవాలి..?

బెంగాలీ స్పెషల్ లిక్కర్ టీ నే కొందరు బ్లాక్ టీ అని కూడా పిలుస్తుంటారు. ఈ టీ టేస్ట్ తో పాటు మంచి సువాసన కూడా వస్తుంది. అదే దీని స్పెషల్. అంతేకాక ఈ టీ ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ టీ తయారు చేసుకోవడానికి గల పదార్థాలను చూస్తే.. మిరియాలు - పావుటీస్పూన్ అలాగే అల్లం ఒక ముక్క, చక్కెర 2 టేబుల్​ స్పూన్ లు, రెండు బిర్యానీ ఆకులు, అలాగే 1 టీస్పూన్ టీ పొడి కావాలి.

Bengali Liquor Tea A Spicy Monsoon Kick to Warm Your Soul

ఎలా చేసుకోవాలి..

ముందుగా ఒక స్టౌపై ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో చక్కెర వేసి కలిపి హై ఫ్లేమ్ మీద పెట్టి నీటిని బాగా మరగనివ్వాలి. అలా మరిగిన నీటిలో బిర్యానీ ఆకులను తుంపి వేసుకోవాలి. అలాగే.. కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, అల్లం వేయాలి. మరోసారి హై ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు మరగనివ్వాలి. ఒక నిమిషం పాటు అలా మరిగించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ స్పెషల్ లిక్కర్ టీ రెడీ అయినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+