లివర్ ను ఆరోగ్యంగా ఉంచాలంటే ఇవి తినండి
మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైనది. దాదాపుగా అన్ని పనుల్లో దీని అవసరం ఉంటుంది. అందుకే లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. శరీరంలో జీవక్రియను పెంచడమే కాకుండా మలినాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చెడు అలవాట్లు పాటించడంద్వారా లివర్ ను మనుషులే ఎవరికి వారుగా దెబ్బతీసుకుంటున్నారు. లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి ఏమేమిటనేది తెలుసుకుందాం.
వెల్లుల్లి : లివర్‌కు ఒక అద్భుతమైన ఆహారం వెల్లుల్లి. ఇందులో అల్లిసిన్ అనే రసాయన పదార్థం లివర్‌ను శుభ్రపరచడాన్ని ప్రోత్సహిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండి లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

క్యాలీఫ్లవర్ : క్యాలీఫ్లవర్ లివర్‌కు మంచి ఆహారం. ఇది కూడా లివర్ ను శుభ్రపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. ఇవి లివర్ దెబ్బతినే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
పుచ్చకాయ : పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ లివర్ ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడతాయి. లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే పుచ్చకాయను తీసుకోవడంద్వారా నయమవుతుంది.
నువ్వుల గింజలు : నువ్వుల్లో ప్రోటీన్, విటమిన్ ఇతోపాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. లివర్ సామర్థ్యాన్ని పెంచుతాయి.
దోసకాయ : ఇది లివర్‌కు అద్భుత ఆహారం. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో నీరు ఉండటంవల్ల శరీరం నుంచి విషపూరితాలు బయటకు వెళ్లిపోతాయి. దోసకాయ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది
టీ : టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే లివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు గ్రీన్ టీ, బ్లాక్ టీ తీసుకుంటే చాలా మంచిది. గ్రీన్ టీ తీసుకోవడంవల్ల లివర్ కు ఎంతో సాయపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. లివర్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. టీనే కాకుండా పరిమితంగా తీసుకునే కాఫీ, పండ్లు, టోపు, ఓట్స్, కూరగాయలు కూడా లివర్ ను రక్షిస్తాయి.












Click it and Unblock the Notifications