డయాబెటిస్ బాధితులు కొబ్బరినీళ్ళు తాగొచ్చా.. లేదా?
డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్ మన శరీరంలోని అన్ని ఆర్గాన్స్ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. డయాబెటిస్ బారిన పడినవారు జాగ్రత్త తీసుకోకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
డయాబెటిస్ బాధితులూ జాగ్రత్త
ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు దీర్ఘకాలంలో గుండెజబ్బులను, మూత్రపిండాల వ్యాధులను, నరాల సంబంధిత జబ్బులను, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే డయాబెటిస్ బారిన పడినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని చెపుతారు.

డయాబెటిస్ బాధితులు కొబ్బరినీళ్ళు తాగొచ్చా?
డయాబెటిస్ బారిన పడినవారు చాలామంది ఏది తినాలన్నా, ఏది తాగాలన్న విపరీతంగా భయపడతారు. కొంతమంది డయాబెటిస్ బాధితులు కొబ్బరినీళ్లు తాగాలన్న భయపడుతూ ఉంటారు. అసలు డయాబెటిస్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? తాగకూడదా అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. డయాబెటిస్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. అయితే రోజుకు ఒకటి నుంచి రెండు కప్పులు కొబ్బరి నీళ్లు మాత్రమే తాగడం మంచిది అంతకంటే ఎక్కువ కొబ్బరి నీళ్లు డయాబెటిస్ బాధితులు తాగకూడదు.
షుగర్ కంట్రోల్ లో లేనివాళ్ళు కొబ్బరినీళ్ళు తాగితే
ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచి డయాబెటిస్ ను నియంత్రణలో లేకుండా చేస్తుంది. కొబ్బరి నీళ్లు తక్కువ క్యాలరీల పానీయం అయినప్పటికీ టైప్ టు డయాబెటిస్ తో బాధపడే వారికి, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేనివారికి కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తాగడం మంచిది కాదని చెబుతారు.
మితంగా తీసుకుంటే మంచిది
కొబ్బరినీళ్లు యాంటీ ఆక్సిడెంట్ లతో నిండి ఉండి, శరీరానికి హాని చేసే ప్రీ రాడికల్స్ నుంచి కాపాడటానికి సహాయ పడతాయి. కానీ డయాబెటిస్ బాధితులు మాత్రం వీటిని మితంగానే తీసుకుంటే మంచిది. ముఖ్యంగా కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం మరియు ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఉండే మంచి పోషకాలు అయిన ముఖ్యంగా పొటాషియం రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. గుండె జబ్బులను నియంత్రిస్తుంది.
వ్యక్తి ఆరోగ్య స్థితి, తాగే క్వాంటిటీ ఆధారంగా షుగర్ లెవల్స్
శరీర రోగ నిరోధక వ్యవస్థను కొబ్బరి నీళ్లు మెరుగు పరుస్తాయి. అయినప్పటికీ కొబ్బరి నీళ్లను తాగే విషయంలో డయాబెటిస్ బాధితులు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్న వారి విషయంలో వారు కొబ్బరి నీళ్లను తీసుకునే క్వాంటిటీ, వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి పైన ఆధారపడి పరిస్థితి ఉంటుంది. కొబ్బరి నీళ్లు మాత్రమే కాదు ఏ ఆహారం అయినా సరే డయాబెటిస్ బాధితులు మితంగా తీసుకుంటేనే మంచిది.












Click it and Unblock the Notifications