ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమౌతుందో తెలుసా..?
ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పులు సహజం. అయితే ఈ హార్మోన్ల మార్పులు వల్ల చాలా మందిలో శృంగార కోరికలు పెరుగుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన కొన్ని రోజుల్లో సెక్స్‌ను ఆస్వాదించాలని, భాగస్వామితో రతిక్రీడలో పాల్గొనాలని చాలా మందిలో కోరికలు రాచుకుంటాయి. చాలా రోజుల గ్యాప్ వచ్చేస్తుందన్న భయంతో చాలా మంది సెక్స్ కోసం తహతహలాడుతుంటారు.
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకు ఏమైన ఇబ్బంది కలుగుతుందన్న భయం వల్ల చాలా మంది శృంగారానికి దూరంగ ఉంటారు. అయితే వైద్యులు శృంగారానికి దూరంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పనంత వరకు సెక్స్ లో పాల్గొనవచ్చు. అయితే శృంగారం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జననేంద్రియాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రొమాన్స్ చేయడం వల్ల మరింత మెరుగైన భావప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు, శృంగారం సమయంలో విడుదలయ్యే హార్మోన్లు వల్ల ఈ మంచి ఉద్రేకమైన అనుభూతి కలుగుతుంది. అలాగే సెక్స్ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మంచి మూడ్ ను తీసుకువస్తాయి. ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను అందిస్తాయి. ఇది తల్లికి, గర్భంలో ఉన్న బిడ్డకు మంచిది.












Click it and Unblock the Notifications