జింక్ లోపం ఫెర్టిలిటీ సమస్యకు దారితీస్తుందా?

జింక్ (Zinc) మన శరీరంలో చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది అనేక జీవక్రియల కోసం అవసరం, ముఖ్యంగా ప్రతిరక్షణ వ్యవస్థను బలపరచడంలో, జీర్ణక్రియల నియంత్రణలో, శరీర కణాల పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరానికి అవసరమైన జింక్ సరిపడా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గాయాలను మాన్పిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

జింక్ లోపంతో కలిగే సమస్యలు
జింక్ మన శరీరానికి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. జింక్ లోపం వల్ల శరీరం బలహీనమై, జలుబు వంటి వాటికి దారితీస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో శరీరాన్ని అసమర్థంగా మారుస్తుంది. శరీరంలో జింక్ తక్కువగా ఉంటే, చిన్న గాయాలు కూడా చక్కగా మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది శరీర కణాల పునరుద్ధరణను దెబ్బతీయవచ్చు. కనుక గాయాలను మాన్పడంలో జింక్ కీలకపాత్ర పోషిస్తుంది. జింక్ శరీరంలో ప్రోటీన్, డీఎన్‌ఏ సంశ్లేషణకు అవసరం. జింక్ లోపం జీవక్రియల మందగింపుకు దారితీస్తుంది, ఫలితంగా శరీరంలో శక్తి తక్కువగా ఉంటూ, అలసట ఎక్కువగాను ఉంటుంది.

Can zinc deficiency lead to fertility problems

జింక్ లోపం వల్ల చర్మంపై పొడితనం, వాపు, ఇతర చర్మ వ్యాధులు కనిపిస్తాయి. ఇది మొటిమల (Acne) తీవ్రతను పెంచవచ్చు. జింక్ శరీరంలో చర్మ కణాల పునరుత్పత్తికి చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలలో జింక్ లోపం వారు పెరుగుదలలో వెనుకబడటానికి కారణమవుతుంది. ఇది శరీర కణాల పెరుగుదలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జింక్ లోపం రుచిని , వాసనను అనుభవించగల శక్తిని తగ్గిస్తుంది. ఇది తిండికి మక్కువ తగ్గేలా చేసి, పోషకాల లోపం మరింత తీవ్రమవ్వడానికి దారితీస్తుంది. జింక్ లోపం వల్ల మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఫెర్టిలిటీ సమస్యలకు దారితీస్తుంది.

జింక్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జింక్ లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది ఆందోళన, డిప్రెషన్, మతిభ్రమ వంటి సమస్యలను పెంచుతుంది. పేగు ఆరోగ్యంలో సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణక్రియలో ఆటంకం కలిగించి, డయేరియా వంటి రుగ్మతలను పెంచుతుంది. జింక్ అనేక ఎంజైమ్‌ల పనిచేయడానికి అవసరం. జింక్ లోపం వల్ల కణాల పునరుత్పత్తి మందగిస్తుంది, ఇది అనేక శారీరక సమస్యలకు కారణమవుతుంది.

తీసుకోవాల్సిన ఆహారం
జింక్ లోపం ఉన్నవారు పోషకాహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా లోపాన్ని తగ్గించవచ్చు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గుడ్లు తీసుకోవడం వల్ల ప్రోటీన్, జింక్ పుష్కరంగా ఉంటుంది. ఆహారంలో గోధుమలు, గుమ్మడి, సన్ ప్లవర్ ఎక్కువ జింక్ కలిగివుంటాయి. రాజ్మా, మొలకెత్తిన విత్తనాలు, చేపలు, చికెన్, రెడ్ మీట్ , పాలకూర, బ్రోకోలి, అవకొడా, డ్రైప్రూట్స్ తీసుకోవాలి. తరచూ వీటిని ఆహారంలో చేర్చుకుంటే జింక్ లోపం నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో జింక్ స్థాయిలు సమతుల్యంగా ఉంచడం చాలా ముఖ్యమైనది. వైద్యుల సూచన మేరకు జింక్ సప్లిమెంట్లను తీసుకోవడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+