చికెన్ కారంపొడి.. ఇలా చేస్తే సూపర్ గా, టేస్టీ గా!

నోరు రుచిగా లేనప్పుడు ఏదైనా వెరైటీగా చేసుకుని తినాలి అనిపిస్తుంది. సహజంగా చాలామంది అన్నంలో ముందు తినటం కోసం రకరకాల కారం పొడులు చేసుకుంటారు. కొబ్బరి కారం, పల్లీ పొడి, కందిపప్పు పొడి వంటి కారప్పొడులు రకరకాలుగా చేసుకుని తింటాం. కానీ చికెన్‌తో కారం పొడి చేసుకుంటే రుచి మరోలా ఉంటుంది. చికెన్ కారప్పొడి అన్నంలోకే కాదు, టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది. చికెన్ కారప్పొడి తయారీవిధానం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

బోన్‌లెస్ చికెన్ - పావు కిలో
ఎండు మిర్చి - 20
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర, మినపప్పు, శనగపప్పు - ఒక్కో టేబుల్ స్పూన్
అల్లం - ఒక అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 12
కరివేపాకు - 2 రెమ్మలు
ఉప్పు - తగినంత
పసుపు - అర స్పూన్
నూనె - ఒకటిన్నర స్పూన్లు

Chicken karam podi Know the simple homemade recipe for chicken karampodi using boneless chicken

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి చికెన్ ముక్కలకు పసుపు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలిపి నీరు పూర్తిగా ఇగిరిపోయే వరకు ఉడికించాలి. ఆపై అందులోనే నూనె వేసి చికెన్ ముక్కలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి చల్లార్చాలి.

తెలంగాణా సర్వపిండి.. ఇలా చేస్తే క్రిస్పీగా, సూపర్ గా!
తెలంగాణా సర్వపిండి.. ఇలా చేస్తే క్రిస్పీగా, సూపర్ గా!

ఇలా చేస్తే సూపర్ చికెన్ కారంపొడి

ముందుగా ఈ మసాలా దినుసులను గ్రైండర్‌లో పొడి చేసుకోవాలి. తర్వాత క్రిస్పీ చికెన్ ముక్కలను కలిపి కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేయాలి. బాగా మెత్తగా చేస్తే చికెన్ ఫీల్ ఉండదు. కనుక బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన చికెన్ కారం పొడి సిద్ధం. వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే రెండువారాల వరకు తాజాగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే బయట కొన్నవాటి కంటే రుచి, పరిశుభ్రత రెండూ బాగుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+