చికెన్ లివర్ తినేవారు తప్పక తెలుసుకోవాలి!
చాలామంది చికెన్ ఇష్టంగా తింటారు. అయితే చికెన్ మాత్రమే కాదు చికెన్ లివర్ లో కూడా మన శరీరానికి ఉపయోగపడే బోలెడన్ని పోషకాలు ఉంటాయి. చికెన్ లివర్ తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మనం చికెన్ లివర్ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.
చికెన్ లివర్ లో ఫుల్ పోషకాలు
చికెన్ లివర్ లో ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి12, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. చికెన్ లివర్ లో ఉండే ప్రోటీన్ మన కండరాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన శరీరానికి శక్తిని అందిస్తుంది. చికెన్ లివర్ లో ఉండే పోషకాల కారణంగా మన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

చికెన్ లివర్ తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
చికెన్ లివర్ లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన శరీరంలోని ఐరన్ లోపాలను పరిష్కరిస్తుంది. రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది.చికెన్ లివర్ లో ఉండే పోషకాలు మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చికెన్ లివర్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కంటి చూపును మెరుగుపరచడానికి, తక్కువ కాంతిలో కూడా కళ్ళు బాగా పని చేయడానికి దోహదం చేస్తుంది.
నరాలకు, మెదడుకు చికెన్ లివర్ బెస్ట్
చికెన్ లివర్ లో ఉండే పోషకాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఇందులో నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి దోహదం చేసే విటమిన్ బి12, మరియు ఫోలేట్ ఉంటుంది. దీనివల్ల నరాల మరియు మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. చికెన్ లివర్ లో ఉండే పోషకాలతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన పోషకాలను కూడా చికెన్ లివర్ అందిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆహారం
ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి సరైన ఎంపికగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు చికెన్ లివర్ దోహదం చేస్తుంది. అయితే చికెన్ లివర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని అదే పనిగా దానిని తినడం మంచిది కాదు.
చికెన్ లివర్ ఇలా తినాలి
అతిగా చికెన్ లివర్ తింటే అనవసరమైన ఆరోగ్య అనర్ధాలు చోటు చేసుకుంటాయి. కనుక వారానికి ఒకసారి మాత్రమే చికెన్ లివర్ తినాలని డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. అలాకాకుండా విపరీతంగా చికెన్ లివర్ తింటే అనవసరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications