రుచికరమైన చికెన్ ఫ్రై.. ఇలా ఈజీగా చేసుకోండి..!
చికెన్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చికెన్ తో రకరకాలుగా వంటలు చేసుకుంటారు. చికెన్ ను పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. మరి సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై ను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఈ చికెన్ ఫ్రై అన్నంతో పాటు రోటీ, చపాతీ, పూరీలోకి కూడా టేస్టీగానే ఉంటుంది.
టేస్టీ చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ 500 గ్రాములు, ఉల్లిపాయలు రెండు పెద్దవి, పచ్చిమిర్చి మూడు, అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టేబుల్ స్పూన్ లు, కారం 1.5 టేబుల్ స్పూన్లు, పసుపు పావు టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, గరం మసాలా అర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె నాలుగు టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము కొద్దిగా తీసుకోవాలి.

ఇప్పుడు టేస్టీ చికెన్ ఫ్రై తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ కు కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 20 నిమిషాల పాటు మేరినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మేరినేట్ చేసిన చికెన్ వేసి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. అలా చికెన్ పూర్తిగా కుకింగ్ అయ్యేంత వరకూ ఫ్రై చేయాలి. చివరగా గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications