హైదరాబాదీ 'చికెన్ తహారీ'.. బిర్యానీని మించిన టేస్ట్..!
చికెన్ తో అనేక రకాలుగా వంటలు చేసుకుంటారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు వస్తూనే ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఫేమస్ అయిన వంటకాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. వాటిని చూసినప్పుడు మనకూ అలాగే చేసుకోవాలని కోరిక ఉంటుంది. కానీ ఆ వంటకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై క్లారిటీ ఉండదు. అలాంటి వంటకమే చికెన్ తహారీ .. ఈ కొత్తరకం 'చికెన్ తహారీ' ని ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సూపర్ రెసిపీ తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూద్దాం..
'చికెన్ తహారీ' కి కావాల్సిన పదార్థాలు చూస్తే.. అరకిలో చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత, బాస్మతి బియ్యం, నెయ్యి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె తగినంత, లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చిన చెక్క, కారం, గరం మసాలా, నిమ్మరసం, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు తీసుకోవాలి.
'చికెన్ తహారీ' తయారీ విధానం చూస్తే.. ముందుగా ఓ గిన్నెలోకి బియ్యం తీసుకుని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. ఆ మిశ్రమంలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, పుదీనా, టమాటా ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.

ఆ మిశ్రంలో ఇప్పుడు చికెన్ వేయాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, గరం మసాలా వేసుకోవాలి. అన్నీ బాగా కలిపి మూతపెట్టి సుమారు 8 నిమిషాల పాటు మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నాన బెట్టిన బియ్యం వేయాలి. అందులోనే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మొత్తం ఓసారి కలిపిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకుని కుక్కర్ మూత పెట్టాలి. ఇప్పుడు స్టౌ ఆపేసి ఆవిరి మొత్తం పోయేంత వరకూ అలా వదిలేయాలి. ఇప్పుడు చివరగా అందులో నిమ్మరసం, నెయ్యి వేసి కలుపుకుంటే సరి.. సూపర్ టేస్టీ చికెన్ తహారీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications