లవంగం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా?

లవంగం ఒక మంచి మసాలా దినుసు. ఇందులో ఔషధ గుణాలు భారీగా దాగి ఉన్నాయి. పూర్వకాలం నుంచి దీనిని వాడుతూ ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. లవంగం రుచి హాట్‌గా ఉంటుంది. దీన్ని పులావ్, బిర్యానీ, మటన్‌, చికెన్ తదితర వంటకాలు తయారుచేసేటప్పుడు ఉపయోగిస్తారు. వంటకాల రుచిని మరింత పెంచుతుంది.

లవంగాలతో మసాలా టీ తయారుచేస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కాపాడుతుంది. లవంగాల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. వాటిని ఎక్కువగా తింటే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది.
మెదడుపై ప్రభావం

clove health benefits and uses

లవంగాల్లో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. దీనిని పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డైటీషియన్లు చెబుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, బలహీనత లాంటివి వస్తాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలుంటే లవంగాలు తినడం మానుకోవాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

నోటిపూత వస్తే ఇష్టమైన ఆహారాన్ని తినలేం. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో నోటిలో నొప్పి, వాపు, రక్తస్రావం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లవంగాల వినియోగాన్ని నియంత్రించుకోలేని వ్యక్తులు అనేక రకాల కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఇది మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి, అతిసారం, వాంతులు వంటివాటికి దారితీస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+